https://oktelugu.com/

Tyler Swift : ఈ గాయకురాలు చరిత్ర సృష్టించింది.. ఒకే ఒక పర్యటనతో మిలియనీర్ అయింది.. ఇంతకీ ఈమె ఎవరు? ఎంత సంపాదించిందంటే?

టైలర్ స్విఫ్ట్ " ది ఎరాస్ టూర్" పేరుతో 21 నెలల పాటు ఐదు ఖండాల్లో 149 ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలకు 10 మిలియన్ల మంది హాజరయ్యారు. ఇటీవల బ్రిటిష్ కొలంబియాలో వాంకోవర్ ప్రాంతంలో ప్రదర్శన ఇచ్చింది. ఆ ప్రదర్శన ద్వారా ఆమె టూర్ ముగిసింది. ఈ టూర్ కు సంబంధించి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ సరికొత్త నివేదిక విడుదల చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 27, 2024 / 07:31 AM IST

    Famous Singer Tyler Swift

    Follow us on

    Tyler Swift : మనదేశంలో బాగా ఆర్జించే గాయకులు ఎవరంటే.. ఏ ఆర్ రెహమాన్, కార్తీక్, శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషాల్, జొనీతా గాంధీ పేర్లు గుర్తుకొస్తాయి. వీళ్ళు ఒక్క పాటకు లక్షల్లో చార్జ్ చేస్తారు. అందుకే వీళ్లు శ్రీమంతులుగా పేరుపొందారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆశాభోంస్లే, లతా మంగేష్కర్ వంటివారు జీవించి ఉన్నప్పుడు భారీగానే సంపాదించేవారు. మన దేశాన్ని కాస్త పక్కన పెట్టి.. ఒకసారి ప్రపంచం గురించి ఆలోచిస్తే.. మైకల్ జాక్సన్ (దివంగత), జస్టిన్ బీబర్, జాన్ సీనా, నిక్ జోనాస్ పేర్లు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు వారందరినీ కూడా తలదన్ని.. సరికొత్త రికార్డు సృష్టించింది అమెరికన్ స్టార్ సింగర్ టైలర్ స్విఫ్ట్. ఆమె ఒకే ఒక్క టూర్ తో దాదాపు 16 వేల కోట్ల వరకు సంపాదించింది.

    టైలర్ స్విఫ్ట్ ” ది ఎరాస్ టూర్” పేరుతో 21 నెలల పాటు ఐదు ఖండాల్లో 149 ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలకు 10 మిలియన్ల మంది హాజరయ్యారు. ఇటీవల బ్రిటిష్ కొలంబియాలో వాంకోవర్ ప్రాంతంలో ప్రదర్శన ఇచ్చింది. ఆ ప్రదర్శన ద్వారా ఆమె టూర్ ముగిసింది. ఈ టూర్ కు సంబంధించి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ సరికొత్త నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టేలర్ స్విఫ్ట్ దాదాపు రెండు బిలియన్ డాలర్లను సంపాదించింది. అది మన కరెన్సీ ప్రకారం 16 వేల కోట్లు. ఈ సంపాదన ద్వారా ఆమె బిలియనీర్ హోదాను పొందింది. ఉప్పొంగే ఉత్సాహానికి ప్రత్యేకగా టేలర్ నిలుస్తారు. ఆమె తన ప్రతిపాటలో సామాజిక దృక్పథాన్ని పెంపొందిస్తారు. అందువల్లే ఆమె పాటలను పాశ్చాత్య దేశాల ప్రజలు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అందువల్లే ఆమె ఇంత స్థాయిలో క్రేజ్ పొందగలిగారు. ఒకప్పుడు మైకల్ జాక్సన్ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఎంతోమంది గాయకులకు వచ్చినప్పటికీ టేలర్ మాదిరిగా ప్రపంచాన్ని చుట్టి రాలేకపోయారు. కానీ టేలర్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. తన ఉత్సాహాన్ని ప్రపంచం మొత్తం ప్రదర్శించాలని భావించారు. అందువల్లే 21 నెలల పాటు తన బృందంతో విపరీతంగా కష్టపడ్డారు. ఐదు ఖండాలలో .. అక్కడి ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా పాటలు రూపొందించి ఆకట్టుకున్నారు. మొత్తంగా 149 ప్రదర్శనలు ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు. పది మిలియన్ ప్రజలను ఆకట్టుకున్నారు. వాంకోవర్ ప్రాంతంలో జరిగిన ప్రదర్శనకు ఏకంగా 0.5 మిలియన్ ప్రజలు వచ్చారు. ఆమె పాటలు పాడుతుంటే.. వాటికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు.

    అందుకే అంత క్రేజ్

    టేలర్ సాధరణ గాయని కాదు. అమెరికా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. అందువల్లే ఆమెకు సామాజిక దృక్పథం ఎక్కువ. ఆ దృక్పథాన్ని తన పాటల్లో ప్రతిబింబిస్తుంది. ఫలితంగా ఆమె పాటలకు అమెరికాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇతర వెస్ట్రన్ కంట్రీస్ లోనూ విశేషమైన ఆదరణ ఉంటుంది. ఆమె నుంచి ఒక ఆల్బమ్ విడుదలయితే చాలు.. అది అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బిలియన్ అమ్మకాలతో రికార్డులు సృష్టిస్తుంది. అందువల్లే టేలర్ అంటే అమెరికావ్యాప్తంగా యువత చెవి కోసుకుంటారు. ఆమె పాటలంటే ఇష్టపడుతుంటారు. ” టేలర్ గొప్పగా పాడుతుంది. ఆమె ఉద్వేగం నచ్చుతుంది. ఆమె ఉత్సాహం బాగుంటుంది. సామాజిక దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఆమె పాటలోని భావాలు లోతుగా ఉంటాయి. అందువల్లే అవి ఆకట్టుకుంటాయని” అమెరికన్లు వ్యాఖ్యానిస్తుంటారు.. సోషల్ మీడియాలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు.. అయితే టేలర్ ఇప్పటివరకు చూపించింది శాంపిల్ మాత్రమేనని.. ఇకముందు ఆమె అసలు రూపాన్ని చూపిస్తారని అమెరికన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే టేలర్ అభిమానుల్లో ఎక్కువ శాతం యువత ఉండడం విశేషం.