Sindh Floods Disaster: భీకరంగా వరద నీరు వస్తోంది. ఆ వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుంది. దూరం నుండి చూస్తేనే ఆ దృశ్యం భయంకరంగా ఉంది. వాస్తవానికి దూరం నుంచి కూడా వరద గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రవాహం ఆ తీరుగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అక్కడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. కానీ ఈ రిపోర్టర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఏదో యుద్ధాని కవర్ చేస్తున్నట్టు.. స్కామ్ వెలికి తీసినట్టు బిల్డప్ ఇవ్వబోయాడు.. చివరికి ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు.
Also Read: Babu shock to Pawan Kalyan: పదవుల్లేవ్.. పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన బాబు
పాములు పట్టేవాడు పాము కాటుకే బలవుతాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇది అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ గా వెళ్లడం అనేది అత్యంత మూర్ఖమైన చర్య. పాపం ఈ రిపోర్టర్ కు అది అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత అతని ప్రాణమే పోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది.. పాకిస్తాన్ లో సింధ్ ట్రావెల్స్ పరిధిలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు అంతకుమించి అనే రేంజ్ లో వస్తున్నాయి. దీనిని కవరేజ్ చేయడానికి ఓ రిపోర్టర్ వెళ్ళాడు. దూరం నుంచి కెమెరామెన్ సహాయంతో ఆ దృశ్యాలను చిత్రీకరించి అక్కడి పరిస్థితిని చెబితే సరిపోయేది. కానీ అతడు ఓవరాక్షన్ చేశాడు. తనను మించిన రిపోర్టర్ లేడు అని చెప్పుకోవడానికి వరదనీటిలోకి దిగాడు. వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. అప్పటికైనా అతడు జాగ్రత్త పడాల్సింది.. అలా చేయకుండా తన మానాన తాను చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. ఈలోగా వరద ప్రవాహం మరింత పెరిగింది.. అంతే చూస్తుండగానే అతడు కొట్టుకుపోయాడు.
ఈ వీడియోను కొంతమంది నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.. ఈ వీడియో ఇప్పుడు లక్షలలో వీక్షణలు సొంతం చేసుకుంది. దీనిపై రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి..” రిపోర్టింగ్ చేయి తప్పులేదు. అంతేగాని ఇలా అడ్డగోలుగా చేయడం తప్పు. ప్రకృతి విపత్తు సంభవించింది. అది విపత్తు అని తెలుసు. దానికి ఎలా ఎదురు వెళ్తావ్.. అలా ఎదురు వెళ్లి ఏం చేద్దాం అనుకున్నావ్. చివరికి చూస్తుండగానే కొట్టుకుపోయవ్. నువ్వు పని చేస్తున్న సంస్థ ఇప్పుడు నీకు అండగా ఉంటుందా? కుటుంబానికి భరోసా ఇస్తుందా? ఇతడు మాత్రమే కాదు.. ఇతడి ఇలాంటి రిపోర్టర్లు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. రిపోర్టింగ్ చేయడం మంచిదే. వాస్తవ పరిస్థితిని చెప్పాలి అనుకోవడం కూడా మంచిదే. కానీ ఇలా ప్రాణాలకు తెగించి పనిచేస్తేనే అసలు ప్రమాదం. మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి రిపోర్టర్ల కుటుంబాలే రోడ్డున పడతాయి. అప్పుడు ఏ మేనేజ్మెంట్ కూడా ఆదుకోవడానికి ముందుకు రాదని” నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
Also Read: Banakacharla project controversy: బనకచర్లపై ‘జగన్నా’టకం?
అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో అక్కడ వరదలు బీభత్సంగా వస్తున్నాయి. పాకిస్థాన్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో నష్టం తీవ్రంగా ఉంది. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వంతెనలు కూలిపోతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు వర్షాలు వల్ల నరకం చూస్తున్నారు. గతంలో కురిసిన వర్షాలకు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే అక్కడ రోడ్లు వేయలేదు. ఆ నష్టాన్ని మర్చిపోకముందే మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. అంతకు మించిన స్థాయిలో నష్టాన్ని కలగజేస్తున్నాయి.
⚡ A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water. pic.twitter.com/psQsgDMsFI
— OSINT Updates (@OsintUpdates) July 17, 2025