Homeఅంతర్జాతీయంVisa Tourism: త్వరపడిండి: కోటి డిపాజిట్ చేస్తే వీసా.. 10 ఏళ్లు ఆ దేశంలో ఉండొచ్చు

Visa Tourism: త్వరపడిండి: కోటి డిపాజిట్ చేస్తే వీసా.. 10 ఏళ్లు ఆ దేశంలో ఉండొచ్చు

Visa Tourism: ద్వీపాలకు పెట్టింది పేరు ఇండోనేషియా.. తన సముద్రంలోని అందమైన ద్వీపాల్లో పర్యటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలోని బాలి ద్వీపంపై దృష్టి సారించింది. ఆగ్నేయాసియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధిని సాధించాలని.. దీర్ఘకాల పర్యాటక ప్రాంతంగా ఎదిగేందుకు ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది. సంపన్న ప్రపంచ పౌరులను ఆకర్షించడానికి ఇండోనేషియా ఈ రేసులోకి ప్రవేశించింది.

ఇండోనేషియాలో కనీసం కోటి రూపాయలు (S$180,800 డాలర్లు) పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఉచిత వీసాను జారీ చేస్తామని ఆ దేశం ప్రకటించింది. మంగళవారం జారీ చేసిన కొత్త చట్టాల ప్రకారం.. 10 సంవత్సరాలపాటు బాలిలో ఉండేలా కొత్త “సెకండ్ హోమ్ వీసా”ను ప్రకటించింది. పెట్టుబడి పెట్టిన వారికి 10 ఏళ్లు బాలిలో నివాసం ఉండొచ్చు.

డిసెంబరు 25 తర్వాత ఈ చట్టం అమల్లోకి రానుంది. కొత్త రూల్ జారీ చేసిన 60 రోజుల తర్వాత పాలసీ అమల్లోకి వస్తుంది. “ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు సానుకూల సహకారం అందించడానికి కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహం” అని ద్వీపంలో రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ ప్రకటించారు.

కోస్టా రికా నుండి మెక్సికో వరకు ఉన్న దేశాల్లోని అందరికీ ఈ నియమాన్ని ఇండోనేషియా ప్రకటించింది. ప్రొఫెషనల్స్, రిటైర్‌ మెంట్ వారు , ఇతర సంపన్న వ్యక్తులను ఆకర్షించడానికి దీర్ఘకాల బసను అందించడానికి ఈ వీసీ సౌకర్యాన్ని అందిస్తోంది.

వలసలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జనాలు, సంపన్ను అందరూ సుఖవంతమైన జీవితం కోసం ప్రయత్నిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అందరి అభురుచి మారింది. పనిని రిమోట్‌గా కొనసాగించడానికి బదులుకొత్తగా స్వేచ్ఛను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.అందుకే ఇండోనేషియా కూడా తమ దేశంలో డబ్బులు పెట్టుబడి పెడితే ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఇండోనేషియా 2021లో డిజిటల్ నోమాడ్ వీసా కోసం ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ హాలిడే స్పాట్ గా దేశాన్ని మార్చాలని కంకణం కట్టుంది. విదేశీ మారకపు ఆదాయానికి ప్రధాన వనరు అయిన బాలికి సందర్శకులను ఆకర్షించడంపై దృష్టి సారించింది.

నవంబర్‌లో బాలిలో జరగనున్న గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్‌కు ముందు గరుడ ఇండోనేషియా వంటి విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించడంతో, ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజుకుంది. ఇది ఈ ద్వీపంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విప్లవాత్మక మార్పులు చేసిన ఇండోనేషియా.. మరి ఆ దిశగా పర్యాటకులను ఆకర్షిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper
Exit mobile version