TACA Sankranti Celebrations: తెలుగువారు జరుపుకునే ప్రధాన పండుగుల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా జరుపుకుంటారు. తాజాగా కెనడా(Canada)లోనూ తాకా(TACA) తెలుగులయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Allancese Of Canada ఆధ్వర్యంలో 2025, జనవరి 11న టోరంటోలో బ్రాంప్టన్ చింగువాకూసి సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించారు. 1200 మంది తెలుగువారు ఈ సంబురాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాకా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల వేడుకలను ప్రారంభించారు. కోశాధికారి మల్లిఖార్జునాచారి సభికులను ఆహ్వానించారు. ధనలక్ష్మి మునుకుంట్ల, విశారద పదిర, వాణ జయంతి, అనిత సజ్జ, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంబమయ్యాయి.
కెనడా జాతీయ గీతాలాపనతో..
వేడుకలు జనవరి 11న సాయంత్రం 5:30 గంటలకు ప్రాంభించారు. కెనడా జాతీయ గీతాలాపనతో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు సుమారు 5 గంటలపాటు అంటే రాత్రి 10:30 గంటల వరకు కొనసాగాయి. సంక్రాంతి పండుగ సంప్రదాయలతో ప్రముఖ పురోహితులు శ్రీమంజునాథ్ ధ్వర్యంలో పిల్లలకు భోగిపంళ్లు పోశారు. గారు జరిపించగా, తల్లిదండ్రులు, ముత్తయిదువులు పండుగ సంస్కృతిని కొనసాగిస్తూ ఆశీర్వదించారు. కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్రకాంత్ ఆర్య వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెనడా తూర్పు కాలమానం(East Canada Timings) ప్రకారం తెలుగు అతిథులు నక్షత్రాలతో తయారు చేసిన తాకా 2025 క్యాలెండర్(Calendar)ఆవిష్కరించారు.
ప్రముఖుల ప్రసంగాలు..
ఈ కార్యక్రమ వ్యాఖ్యాతలుగా అనిత సజ్జ, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి వ్యవహరించారు. ఇక ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు మాట్లాడారు. తాకా వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసినదిగా కోరారు. ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం మాట్లడుతూ శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయంతో సంగీతం, నాట్యంలో డిప్లొమా, డిగ్రీ కోర్సులు కెనడాలో బోధన కోసం తాకా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు తెలిపారు. త్వరలోనే తరగతులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. తాకా ముఖ్య ఫౌండర్ హనుమంతాచారి సామంతపుడి, సభికులనుద్దేసించి ప్రసంగించారు.
విజేతలకు బహుమతులు..
వేడుకలకు ముందు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పండుగ సంబరాలలో తాకావారు పన్నెండు రకాల వంటకాలతో ఏర్పాటుచేసిన రుచికరమైన తెలుగు భోజనం అందరూ ఆరగించి తాకా కమీటీ సభ్యుల కృషిని కొనియాడారు. అధక్షుడు రమేశ్ మునుకుంట్ల మాట్లాడుతూ తాకా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకేవేదికపైకి తీసుకురావడం ముఖ్యం కాగా, అందు కోసం సహకరిస్తున్న గ్రాండ్ స్పాన్సర్ శ్రీరామ్ జిన్నాల, ప్లాటినం స్పాన్సర్లు హైదరాబాద్ హౌస్ మిస్సిస్సౌగా రెస్టారెంటు, సన్లైట్ ఫుడ్స్ , గోల్డు స్పాన్సర్లు మరియు సిల్వర్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వేడుకల్లో వీరు..
తాకా సంక్రాంతి సబురాల్లో బోర్డు ట్రస్టీ వాణి జయంతి, సంక్రాంతి పండుగకు సహకరించిన స్పాన్సర్లు, దిజిటల్ స్క్రీన్ టీం, డీజే టీం, డెకోరేషన్ టీం, ప్రంట్ డెస్క్ టీం, ఫుడ్ టీం, ఆడియో వీడియో టీం , వలంటీర్లను సమన్వయ పరచిన శ్రీ గిరిధర్ మోటూరి, మరియు పీల్ డిస్త్రిక్టు స్కూలుబోడు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు ప్రదీప్ కుమార్‌రెడ్డి ఏలూరు, యూత్ డైరక్టర్లు సాయి కళ్యాణ్ వొల్లాల, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి, రాజా అనుమకొండ, ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండెషన్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీలు వాణి జయంతి, పవన్ బాసని, ఫౌండర్ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు.