Sahara desert: భూమిపై ఉన్న ఎడారిలో రెండవ అతిపెద్దది సహారా. సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంలో అల్జీరియా, బర్కినా ఫాసో, చాద్, ఈజిప్టు, లిబియా, మాలీ, మొరాకో, నైగర్, సెనెగల్, సూడాన్, ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉంది. అసలు ఇక్కడ వర్షాలు పడవు. ఎప్పుడు కూడా పొడి వాతావరణమే ఉంటుంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత గత సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఎండ మాత్రమే ఉండి ఈ ఏడారిలో ఒక్కసారిగా చిలుకురు జల్లులు కురవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే సహారా ఎడారిని మనుషులు సృష్టించారని కొందరు అంటున్నారు. దాదాపు ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సహారా ఎడారిని మనుషుల సృష్టించారని.. దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డా. డేవిడ్ రైట్ ద్వారా ఫ్రాంటియర్స్ తెలిపారు. దీనిలో మానవుల పాత్ర కూడా ఉందన్నారు. ఎందుకంటే ఆఫ్రికన్ తేమతో ఉన్న ఈ ఎడారిలో పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంది. డిఫరెంట్ మొక్కలు ఉంటాయి. అలాగే పెద్ద జంతువులు, తయారు చేసిన రాక్ పెయింటింగ్ మొసళ్లు, ఏనుగులు, జీరాఫీలు ఉన్నాయి. అలాగే మానవులు తినే ఆహారం అన్ని ఉన్నాయి. కానీ వ్యవసాయమే లేదన్నారు. ఆ కాలంలో నివసించే ప్రజల ఆహారంలో ప్రధానమైనది నైలు పెర్చ్, చేపలు. అప్పట్లో ఇక్కడ భారీ సహారాన్ సరస్సులు ఉండటంతో అందులో చేపలు పట్టేవారట. ఆ సరస్సుల కారణంగా ఇప్పుడు సహారా ఎడారిగా మారిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత విషయం తెలియదు. గతంలో ఒక తడి ప్రాంతంగానే ఉండేదట. ఇప్పుడే పొడి ప్రాంతంగా ఎడారిగా మారిపోయిందని అంటుంటారు.
సహారా ఎడారి ఇలా మారడానికి ముఖ్య కారణం భూమి కక్ష్యలో సూక్ష్మమైన మార్పులు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల వర్షపాతం తగ్గిందని ఇలా ఎడారిగా మారిందట. కేవలం మానవులు చేసిన పర్యావరణ, వాతావరణ మార్పుల వల్ల జరిగిందని డేవిడ్ తెలిపారు. వృక్షసంపద తగ్గడంతో భూమి ఆల్బెడో పెరిగింది. ఇలా వర్షపాతం తగ్గిందని అంటున్నారు. బలహీనపడుతున్న రుతుపవనాలు మరింత ఎడారీకరణకు కారణమయ్యాయి. ఈ ఏడారిలో ప్రతిచోటా సరస్సులు ఉన్నాయని అవి మారుతున్న వృక్ష సంపదను కలిగి ఉన్నాయని తెలిపారు. పురావస్తు శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, కంప్యూటర్ నమూనాలను ఉపయోగించి వాటి వివరాలను సేకరించవచ్చని తెలిపారు.ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది ఎడారి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. శుష్క వాతావరణంలో మానవుడు ఎలా నివసిస్తున్నాడో చూస్తున్నాం. ఈ సహారా ఎడారిగా మారడానికి ముఖ్య కారణం మానవులే అని, వారి అలవాట్లే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఎడారిలో ఉన్న ఇసుకతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ దీన్ని మానవులే సృష్టించారని సరైన ఆధారాలు అయితే లేవు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.