Homeఅంతర్జాతీయంRussia Cancer Vaccine: క్యాన్సర్‌పై వ్యాక్సిన్‌ అస్త్రం.. రష్యా విప్లవాత్మక ఆవిష్కరణ!

Russia Cancer Vaccine: క్యాన్సర్‌పై వ్యాక్సిన్‌ అస్త్రం.. రష్యా విప్లవాత్మక ఆవిష్కరణ!

Russia Cancer Vaccine: క్యాన్సర్‌.. ఒకప్పుడు ఊరికి ఒకరో ఇద్దరో బాధితులు ఉండేవారు. ఎయిడ్స్‌ తర్వాత ప్రమాదకరమైన జబ్బుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. పెరుగుతున్నా కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రసాయనాలతో కలుషిత ఆహారం రేడియేషన్‌ తదితర కారణాలతో ఇప్పుడు కార్యన్సర్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చినా.. ఖరీదైనది కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో క్యాన్సర్‌ నివారణకు శాస్త్రవేత్తలు కూడా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. దక్షిణ కొరియా ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారు చేస్తోంది. ఈ క్రమంలో రష్యా కూడా ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది క్యాన్సర్‌ చికిత్సలో ఒక సంచలనాత్మక అడుగు. ఈ ఏడాది చివరిలో మానవ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్, ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ క్యాన్సర్‌ను నివారించడంలో లేదా చికిత్స చేయడంలో కీలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఏఐ ఆధారిత వ్యాక్సిన్‌..
కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలను ఉపయోగించి రూపొందించిన ఈ వ్యాక్సిన్, క్యాన్సర్‌ కణాలను కచ్చితంగా గుర్తించి నాశనం చేయడంలో శరీర రోగనిరోధక వ్యవస్థను శిక్షణ చేస్తుంది. సంప్రదాయ చికిత్సలు తరచూ ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తాయి, కానీ ఈ ఏఐ–ఆధారిత విధానం వ్యక్తిగతీకరించిన చికిత్సను అందిస్తూ, క్యాన్సర్‌ కణాలను మాత్రమే లక్ష్యంగా చేస్తుంది. ఈ కచ్చితత్వం క్యాన్సర్‌ చికిత్సలో ఒక కొత్త యుగాన్ని సూచిస్తుంది.

Also Read: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలు ఇవే.. భారత్‌ స్థానం ఇదే!

ఉచితంగా అందుబాటులోకి..
ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలన్న రష్యా నిర్ణయం, ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తగ్గించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సాధారణంగా, క్యాన్సర్‌ చికిత్సలు ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండవు. కానీ ఈ వ్యాక్సిన్‌ ఉచితంగా అందించడం ద్వారా, రష్యా ప్రజలందరికీ అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ముందడుగు వేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుంది.

ఈ వ్యాక్సిన్‌ ఇంకా మానవ పరీక్షల దశలో ఉంది, కాబట్టి దీని సమర్థత, భద్రత గురించి పూర్తి స్థాయి ఫలితాలు రావాల్సి ఉంది. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం అయితే, ఇది క్యాన్సర్‌ చికిత్సలో ఒక కొత్త శకాన్ని తీసుకురావచ్చు. అయితే, ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ, వివిధ రకాల క్యాన్సర్‌లపై దీని ప్రభావం వంటి అంశాలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించడం ద్వారా, ఈ వ్యాక్సిన్‌ క్యాన్సర్‌ను ఓడించడంలో ఒక శక్తివంతమైన సాధనంగా మారవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version