Homeఅంతర్జాతీయంRussia Wishes India Republic Day: ‘రష్యన్ల ‘భారతీయత’కు ఫిదా కావాల్సిందే!

Russia Wishes India Republic Day: ‘రష్యన్ల ‘భారతీయత’కు ఫిదా కావాల్సిందే!

Russia Wishes India Republic Day: బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం రావడానికి ప్రధాన కారణం భారత్. అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో పాకిస్తాన్ దేశానికి మందులు, నిత్యవసరాలు, ఇతర పదార్థాలు పంపించింది భారత్. శ్రీలంక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్నది భారత్. పక్కనే ఉన్న మయన్మార్.. భూటాన్.. ఆసియాలో ఉన్న దాదాపు మెజారిటీ దేశాలకు భారత్ ఆపన్న హస్తం అందించింది.

భారత్ ఈ స్థాయిలో సహాయం చేసినప్పటికీ చాలా వరకు దేశాలు మనమీద మట్టి పోస్తూనే ఉన్నాయి. మన నాశనాన్ని కోరుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ భారత్ తన సామర్థ్యంతో శత్రుదేశాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది.

భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు శత్రువులుగా ఉంటే.. రష్యా మాత్రం ఎప్పటినుంచో శాశ్వతమైన మిత్ర దేశంగా ఉంది. ఇంధనం నుంచి మొదలు పెడితే యుద్ధ సామగ్రి వరకు ప్రతి విషయంలో భారతదేశానికి అండదండలు అందిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు ఆయిల్ సరఫరా చేసే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ ధరకు అమ్ముతుంటే.. రష్యా మాత్రం భారతదేశానికి తక్కువధరలో ముడి చమురు విక్రయిస్తోంది.

భద్రత నుంచి మొదలు పెడితే దౌత్యపరమైన విషయాల వరకు ప్రతి విషయం లోనూ భారతదేశానికి రష్యా, రష్యా కు భారతదేశం పరస్పరం అండగా ఉంటూనే ఉన్నాయి. భారత దేశంలో ఉన్న భారతీయులకు రష్యా మీద అపారమైన గౌరవం ఉంటుంది. భారతీయుల మీద కూడా రష్యన్లకు అపారమైన ప్రేమ ఉంటుంది.

భారత్ లో జనవరి 26 న గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఈసారి యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాణిజ్యంపై ఒప్పందాలు జరిగాయి. మన దేశంలో జరిగే గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రష్యన్లు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మనదేశంలో విశేషమైన ప్రాచుర్యం పొందిన భాషలలో శుభాకాంక్షలు చెప్పారు. వాస్తవానికి రష్యన్ దేశస్థులకు మన దేశభాషలను పలకడం చాలా కష్టం. అయినప్పటికీ వారు అత్యంత కష్టమైనప్పటికీ.. మన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్యన్లు తెలియజేసిన శుభాకాంక్షలు మన దేశం మీద ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular