Russia Cancer Vaccine: ఒకప్పుడు వైద్య పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందనప్పుడు అంటువ్యాధులు మనుషులను అంతం చేసేవి. మశూచి ఇలాంటి మహమ్మారులు మనుషుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చేవి. కాలం మారుతున్నా కొద్దీ వైద్య పరిజ్ఞానం మారింది. ఫలితంగా అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. ఇదే క్రమంలో మనుషులు అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. అభివృద్ధి చెందుతున్నా కొద్దీ కొత్త కొత్త రోగాలు వ్యాపించడం మొదలయ్యాయి. అందులో ప్రధానమైనది క్యాన్సర్.
ప్రపంచంలో ఎక్కువ మరణాలు క్యాన్సర్ వల్లే చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు నగరాలలో మాత్రమే క్యాన్సర్ కేసులు అరుదుగా నమోదయ్యేవి. నేడు ప్రాంతాలతో సంబంధం లేకుండా.. మనుషులతో సంబంధం లేకుండా క్యాన్సర్ సోకుతోంది. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రాణాలను తీస్తోంది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం జరగడం.. చికిత్స అందుకోవడంలోనూ ఆలస్యం జరగడంతో ప్రాణాలు పోతున్నాయి. ఇక మగవారిలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ నరకం చూపిస్తోంది. మద్యం.. ధూమపానం అలవాటు ఉన్నవారు కాలేయం.. క్యాన్సర్ బారిన పడుతున్నారు. తద్వారా త్వరగా ప్రాణాలను కోల్పోతున్నారు. ధూమపానం వల్ల ఊపిరి తిత్తులు కూడా పాడవుతున్నాయి. ఇటీవల కాలంలో మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వస్తోంది. దీంతో ఏం చేయాలో పాల్పోవడం లేదు. క్యాన్సర్ లక్షణాలు ఆలస్యంగా కనిపించడం.. చికిత్స చేసుకోవడంలో కూడా కాలయాపన జరగడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో చికిత్స అందించినప్పటికీ ఉపయోగము ఉండడం లేదు. వైద్య విధానాలు అధునాతన స్థాయికి చేరుకున్నప్పటికీ క్యాన్సర్ నిరోధానికి అవి అంతగా పని చేయడం లేదు.. పైగా విపరీతమైన ప్రభావం ఉన్న మందులు వాడడం వల్ల దుష్పరిణామాలు కూడా అధికంగా చోటుచేసుకుంటున్నాయి.
వ్యాక్సిన్ వచ్చేసింది
ప్రపంచాన్ని రాచ పుండు మాదిరిగా ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టేందుకు సరికొత్త ఔషధం తయారైంది. రష్యా దేశానికి చెందిన ఓ కంపెనీ ఎంటెరో మిక్స్ అనే ఔషధాన్ని తయారు చేసింది. ఈ ఔషధం గడ్డలను కలిగిస్తుంది. పైగా వాటిని నాశనం చేస్తుంది. కాలేయం, రొమ్ములు, పెద్ద పేగు వంటి క్యాన్సర్లను ఇది తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. రష్యా దేశానికి చెందిన ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీనిని డెవలప్ చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో కూడా నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీని వినియోగానికి ఆరోగ్యశాఖ తుది అనుమతి ఇవ్వాలని తెలుస్తోంది. మరోవైపు దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఎందుకంటే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్ కాబట్టి దాదాపు ఖరీదు గానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ ఖరీదు ఎంత అనే విషయాన్ని తయారీ సంస్థ ప్రకటించలేదు.. అయితే ఈ వ్యాక్సిన్ రష్యా లో మాత్రమే అందుబాటులో ఉంటుందా.. ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారా.. అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.