Homeఅంతర్జాతీయంRoundup 2025: రౌండప్‌ 2025 : ఏడాదిలో 1.22 లక్షల ఉద్యోగాలు ఊస్ట్‌.. ఐటీ రంగంలో...

Roundup 2025: రౌండప్‌ 2025 : ఏడాదిలో 1.22 లక్షల ఉద్యోగాలు ఊస్ట్‌.. ఐటీ రంగంలో సంక్షోభం

Roundup 2025: కరోనా తర్వాత నుంచి ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనవుతోంది. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం మొదలైంది. దీంతో కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల తొలగింపు చేపట్టాయి. ఇక రెండేళ్లుగా ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐపై పట్టు ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో నైపుణ్యం లేనివారిని పక్కన పెడుతున్నాయి. ఇక 2025లో వివిధ కారణాలతో 257 కంపెనీలు మొత్తం 1.22 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ విషయాన్ని Layoffs.fyi ట్రాకర్‌ వెల్లడించింది. టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాలు తొలగించిన సంస్థల జాబితాలో ఉండడం గమనార్హం.

ఏఐ విప్లవం..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం ఈ తొలగింపులకు మూల కారణం. ఆటోమేషన్, మెషిన్‌ లెర్నింగ్‌ టూల్స్‌ వల్ల కోడింగ్, డేటా అనాలిటిక్స్, కస్టమర్‌ సపోర్ట్‌ వంటి సాధారణ పనులు ఆచూకోవడం సులభమైంది. టీసీఎస్‌లో 15 వేల మంది, మైక్రోసాఫ్ట్‌లో 10 వేల మంది పోస్టులు ఏఐ ఆప్టిమైజేషన్‌ కారణంగా తొలగించబడ్డాయి. ఫలితంగా, మధ్యస్థ స్థాయి డెవలపర్లు, టెస్టర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. భవిష్యత్తులో అఐ స్కిల్స్‌ లేని ఉద్యోగులు మరింత సంకటంలో పడతారు.

ఆర్థిక ఒత్తిడి..
అధిక ద్రవ్యోల్బణం, అమెరికా–చైనా టారిఫ్‌ యుద్ధాలు కంపెనీల ఆర్థిక భారాన్ని పెంచాయి. అమెజాన్‌ 18 వేల మంది, గూగుల్‌ 12 వేల మందిని తొలగించడానికి ఈ కారణాలు చెప్పుకున్నాయి. క్లౌడ్, సాఫ్ట్‌వేర్‌ సేవల డిమాండ్‌ తగ్గడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి మాస్‌ లే ఆఫ్స్‌ ఎంపికైంది. భారతదేశంలోని ఐటీ ఉద్యోగులు 40% ప్రభావితులు హైదరాబాద్, బెంగళూరు సెంటర్లు గణనీయంగా ఖాళీ అయ్యాయి.

ఉద్యోగులు, రంగం మీద ప్రభావం
ఈ తొలగింపులు ఐటీ ఉద్యోగుల్లో అపార అనిశ్చితిని సృష్టించాయి. 25–35 ఏళ్ల వయస్సు గ్రూప్‌ ఎక్కువగా లక్ష్యమయ్యింది. భారతదేశంలో 50 వేల మందికి పైగా ప్రభావం పడిందని అంచనా. స్టార్టప్‌లు కూడా ఈ ట్రెండ్‌లో చేరాయి. ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటివి సిబ్బందిని తగ్గించాయి. మరోవైపు, ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్‌ పెరిగింది.

కంపెనీలు రీస్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లు ప్రవేశపెట్టుతున్నాయి. భారతీయ ఐటీ ఉద్యోగులు అఐ, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ పొందాలి. ప్రభుత్వం ’స్కిల్‌ ఇండియా’ కార్యక్రమాలతో సహకరించాలి. ఈ సంక్షోభం ఐటీ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చే అవకాశం కల్పిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular