Motorola G05 Flipkart Offer: పండుగలు, పర్వదినాల్లో వస్తువులను కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరకే పొందవచ్చు. 2025 ఏడాది ముగిసి 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ఏడాది మొబైల్ వినియోగదారుల కోసం Flipkart గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ ద్వారా తక్కువగా ఉన్నా కూడా ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ గురించి తెలిసినవారు వెంటనే కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ మోటార్ కావాలాలోని ఏ ఫోన్ పై ఆఫర్ ప్రకటించారు?
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి Flipkart ఒక్కోసారి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా మోటరోలా కంపెనీకి చెందిన G 05 అనే మొబైల్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో అనేక రకాల ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 4 జిబి రామ్ సపోర్ట్ తో పనిచేసే ఇందులో ఎక్స్టెన్షన్ కోసం 12gb వరకు పెంచుకోవచ్చు. దీంతో ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా.. వీడియోలు తీసినా కూడా ఫోన్ స్పీడ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో 64 జిబి వరకు స్టోరేజీ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూజింగ్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ మొబైల్ ఫోటోలు, వీడియోలు సేవ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే స్టోరేజ్ విషయంలో 1 TB వరకు పెంచుకునే అవకాశం ఉంది.
మిగతా ఫోన్ల కంటే ఇందులో డిస్ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ మొబైల్ డిస్ప్లే 6.67 అంగుళాల HD+LCD డిస్ప్లేను అమర్చారు. ఇది 90 Hz రిఫ్రిష్ రేటుతో పనిచేస్తుంది. దీంతో స్మూత్ మూవింగ్, యానిమేషన్ వీడియోస్ ఆకర్షినియంగా చూడవచ్చు. అలాగే పిక్ బ్రైట్నెస్ 1000 nits వరకు ఉంటాయి. దీంతో రాత్రి సమయంలోనూ, లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనూ అద్భుతమైన కలరింగ్ తో డిస్ప్లే ఉంటుంది. మిగతా మొబైల్స్ లాగే ఇందులో కూడా 50 MP కెమెరాను అమర్చారు. ఇది ప్రధానంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలోనూ స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. దీంతోపాటు 8 MP సెల్ఫీ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. ఫోర్ కె వీడియోస్ సైతం షూట్ చేయడానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ను అమర్చారు. అలాగే సౌండింగ్ కోసం డాల్ఫి, ఐపీ52 రెసిస్టెన్స్ కూడా సెట్ చేశారు.
అయితే ఈ మొబైల్ పై న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్ ప్రకటించడంతో దీనిని రూ.7,299 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అలాగే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంది.