US Tariffs RBI: భారత రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఒక డాలర్‌తో పోలిస్తే రూ.90 మార్కును దాటింది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. సామాన్యుడిపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఈ పతనం వెనుక ఆర్బీఐ ఒక గొప్ప వ్యూహాత్మక ప్రణాళిక దాగి ఉంది. అమెరికా భారీ టారిఫ్‌లను ఎదుర్కోవడానికి దేశీయ ఆర్థిక వృద్ధిని కాపాడటానికి మానిటరీ పాలసీని రూపాయిని ఆయుధంగా మార్చారు.
రూపాయి బలహీనత వెనుక వ్యూహం
రూపాయి 90కి చేరడం కేవలం పతనం కాదు, ఆర్థిక పోరాటంలో భాగమే. అమెరికా ట్రంప్ పరిపాలన భారత దిగుమతులపై 25–60% టారిఫ్‌లు విధించడంతో దేశీయ పరిశ్రమలు ఒత్తిడిలో పడ్డాయి. దీంతో ఆర్బీఐ రేట్ కట్‌లు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి రూపాయి విలువను కొంత బలహీనపరచడం ద్వారా ఎగుమతులకు పోటీశక్తి పెంచింది. దీంతో టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐటీ రంగాలు ప్రయోజనం పొందాయి.
టారిఫ్‌లకు దీటుగా ఎగుమతి ప్రోత్సాహం..
అమెరికా భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచడంతో దిగుమతుల ఖర్చు రూ.50 వేల కోట్లు పెరిగింది. రూపాయి 85 నుంచి 90కి చేరడంతో భారత ఎగుమతులు 8–10% పోటీశక్తి పొందాయి. ఎంఎస్‌ఎంఈలు, చిన్న పరిశ్రమలు అమెరికా మార్కెట్‌లో ధరల పోటీలో ముందుకు వచ్చాయి. ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ రిజర్వులను 650 బిలియన్ డాలర్లకు చేర్చి మార్కెట్ స్థిరత్వం కాపాడింది.
ద్రవ్యోల్బణం నియంత్రణ..
ఆర్బీఐ రెపో రేట్‌ను 6.25%కి తగ్గించి రుణాల ఖర్చును తగ్గించింది. ద్రవ్యోల్బణం 4.5%లో ఉంచి ఆర్థిక వృద్ధిని 7%కి చేర్చారు. రూపాయి బలహీనత వల్ల ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగినా, దేశీయ ఉత్పత్తులపై ఆధారపడటం పెరిగింది. పీఎల్‌ఐ స్కీమ్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఈ వ్యూహానికి మద్దతుగా నిలిచాయి.
దీర్ఘకాల విజయం..
రూపాయి వ్యూహం వల్ల భారత్ యూరోప్, ఆఫ్రికా మార్కెట్‌ల వైపు మళ్లింది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం 40%కి తగ్గింది. పీఎల్‌ఐ స్కీమ్‌ల కింద మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 25% పెరిగాయి. 2026 చివరిలో రూపాయి 88–89 పరిధిలో స్థిరపడి జీడీపీ 7.5% వృద్ధి సాధిస్తుందని అంచనా.
మొత్తంగా ఆర్బీ రూపాయిని ఆయుధంగా మార్చి అమెరికా టారిఫ్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. సామాన్యుడికి తాత్కాలిక ఒత్తిడి ఉన్నా, దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.