https://oktelugu.com/

Nicolas Aujula: కరోనా వైరస్ గురించి అందరికంటే ముందుగా చెప్పిన వ్యక్తి.. తాజాగా 2025 లో జరగబోయే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు…

అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త ప్రస్తుతం సంచలనం క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లోనే కంగారు పుట్టించేలా ఉన్నా ఈ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By:
  • Mahi
  • , Updated On : January 4, 2025 / 01:49 PM IST

    Nicolas Aujula

    Follow us on

    Nicolas Aujula: కోట్లాదిమంది ప్రజలలో కొంత మంది తమ జీవితంలో చేదు జ్ఞాపకాలను ఎదుర్కొంటే మరి కొంతమంది మర్చిపోలేని విజయాలను సాధించిన 2024 సంవత్సరాన్ని దాటి 2025లోకి అడుగు పెట్టాము. కొత్త ఏడాదిలో తమ జీవితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనదేశంలో ఈ ఏడాది ఎలా ఉంటుంది అనే అనేక విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఉంటారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త ప్రస్తుతం సంచలనం క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లోనే కంగారు పుట్టించేలా ఉన్నా ఈ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 2020 సంవత్సరంలో అడుగుపెట్టిన కొత్తలోనే కరోనా అనే మహమ్మారి అన్ని దేశాలను వణికించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ తో తల్లడిల్లి పోతుంది అని ముందుగా అంచనా వేసిన వ్యక్తి నికోలస్ ఔజోలా. నికోలస్ ఔజోలా 2018 సంవత్సరంలోనే కరోనా లాంటి ఒక మహమ్మారి వస్తుందని దానికారంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. తాజాగా 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు నికోలస్ ఔజోలా.

    2025వ సంవత్సరంలో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని ఇతను తెలిపాడు. ఈ సంవత్సరాన్ని పాపం, హింస ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని నికోలస్ తెలిపాడు. జాతీయవాదం పేరుతో హత్యలు, రాజకీయ హత్యలు జరుగుతాయని ఇతను చెప్పుకొచ్చాడు. సముద్ర మట్టాలు పెరగటం, అధిక వర్షపాతం, వినాశకరమైన వరదలు విరుచుకుపడతాయని ఇతను తెలిపాడు. దీని కారణంగా కోట్లమంది కి ప్రభావం చూపుతుందని, చాలామంది నిరాశ్రయులు అవుతారని ఇతను అంచనా వేశాడు. పలు నగరాలు కూడా మునిగిపోయే అవకాశం ఉందని ఇతను తెలిపాడు. అలాగే ఈ సంవత్సరం బ్రిటన్ యువరాజు విలియం, హరీలా మధ్య విభేదాలు తొలగిపోయి వీరిద్దరూ కలిసి పోతారని ఇతను అంచనా వేశాడు.

    38 ఏళ్ల నికోలస్ ఔజోలా లండన్ కి చెందిన వ్యక్తి. ఇతను హిప్నోథిరపిస్ట్. అతనికి 17 ఏళ్లు ఉన్న సమయంలో అతని కళ్ళలో ఎవరో కనిపించి భవిష్యత్తు గురించి చెప్పారని నికోలాస్ చెప్పడం జరిగింది. గత జన్మలో తాను ఈజిప్టు రాణిగా, అంతకు ముందు జన్మలో చైనాలో టైలర్ గా, హిమాలయాల్లో సన్యాసిగా కూడా జీవించినట్లు తెలిపాడు. నికోలాస్ ఇప్పటివరకు ప్రపంచ పరిణామాలపై చెప్పిన అనేక విషయాలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. ట్రంప్ విజయం, కరోనా వైరస్, రోబో ఆర్మీ ఇలా పలు విషయాల గురించి నికోలాస్ అందరికంటే ముందే చెప్పాడని అందరూ అంటారు. తాజాగా 2025 సంవత్సరం గురించి నికోలాస్ చెప్పిన కొన్ని విషయాలు అందరికీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.