Priyanka Chopra : ఇటీవలే అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు సృష్టించిన అగ్ని ప్రళయం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. ఎన్నో జంతువులు మరణించాయి. గాలి అతి వేగంగా వ్యాప్తి చెందడంతో ఈ నిప్పులు ఒక చోట నుండి మరోచోటికి చేరి నగరం మొత్తాన్ని దగ్ధం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల రూపాయిల ఆస్తులు బూడిదయ్యాయి. 56 వేల ఇండ్లకు ఈ కార్చిచ్చు అంటుకోగా, అందులో 26 వేల ఇండ్లు దగ్దమయ్యాయి. ఎంతో మంది ప్రముఖుల ఇండ్లు కూడా కాలిపోయాయి. ఆ ప్రముఖులలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. ఈమధ్య కాలంలోనే ఈమె ముంబై వదిలి శాశ్వతంగా లాస్ ఏంజిల్స్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ మిలియన్ డాలర్ల సంపాదన ని ఆర్జిస్తూ, గొప్పగా స్థిరపడింది.
ఈమధ్యనే ఆమె లాస్ ఏంజిల్స్ లో ఎంతో ముచ్చట పడి ఒక అందమైన ఇంటిని నిర్మించుకుంది. గత కొంతకాలంగా అక్కడే తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఉంటున్న ఈమె, ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడంతో తీవ్రమైన నిరాశలో ఉందట. ఇంట్లోకి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగడంతో ఇంటి నుండి బయటకి పరుగులు తీసిందట. తన ఇంటిని మంటల నుండి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నమే చేసింది కానీ, చివరికి అది విఫల ప్రయత్నాలుగా మిగిలాయి. చూస్తుండగానే తాను ఎంతో శ్రమపడి నిర్మించుకున్న ఇల్లు కాలిపోవడాన్ని చూసి ఆమె కుప్పకూలిపోయింది. కేవలం ఆమె ఇల్లు ఒక్కటే కాదు, మరో ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడన్ కుమారుడు ఆర్నాడ్, లిబ్రోన్ జేమ్స్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, వంటి ప్రముఖుల ఇండ్లు కూడా ఈ కార్చిచ్చులో దగ్దమయ్యాయి.
ఈ ఘటన తర్వాత లాస్ ఏంజిల్స్ నుండి సుమారుగా మూడు లక్షల మంది ఇండ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఇకపోతే ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి చాలా కాలమైన సంగతి అందరికి తెలిసిందే. క్వాన్టికో అనే వెబ్ సిరీస్ ద్వారా హాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈమె, ‘బే వాచ్’ అనే సినిమాతో లేడీ విలన్ గా తొలిసారి హాలీవుడ్ వెండితెర పై మెరిసింది. ఈ చిత్రం కమర్షియల్ గా అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు క్యూలు కట్టాయి. అప్పటి నుండి వరుసగా ఆమె హాలీవుడ్ చిత్రాలలో విలన్ గా, హీరోయిన్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. రీసెంట్ గా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.