Homeఅంతర్జాతీయంRoyal family controversy: అమెరికాను కుదిపేసింది.. ఇంగ్లాండ్ దాకా వచ్చింది.. ఏకంగా బ్రిటన్ రాజ కుటుంబం...

Royal family controversy: అమెరికాను కుదిపేసింది.. ఇంగ్లాండ్ దాకా వచ్చింది.. ఏకంగా బ్రిటన్ రాజ కుటుంబం వీధిన పడింది

Royal family controversy: సమాజంలో ఒక స్థాయి ఉన్న వ్యక్తులు తమ గొప్పదనాన్ని కొనసాగించాలి. తమ స్థాయికి తగ్గట్టు పనులు చేయాలి. అలాకాకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తే.. పిచ్చి పిచ్చి పనులు చేస్తే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చివరికి వీధిన కూడా పడాల్సి వస్తుంది. ఈ సంఘటన కూడా అటువంటిదే. కాకపోతే ఇందులో వ్యక్తులు చాలా గొప్ప వాళ్ళు. సమాజంలో ఒక స్థాయికి మించిన పేరు సంపాదించి.. సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయి ఉన్నవారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల అగ్రరాజ్యం అమెరికాను సె** కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలలో రాజకీయ నాయకులు, ధనవంతులు ఉన్నారని ప్రచారం జరిగింది. అక్కడి మీడియా కూడా ఇదే స్థాయిలో వార్తలు రాసింది. అయితే ఇప్పుడు ఇందులో బ్రిటన్ యువరాజు అండ్రు (Britain Prince Andrew) ఉన్నారని తెలుస్తోంది. ఆయన పేరు కూడా బయటికి రావడం సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజు చార్లెస్ 111(king Charles 111) తన సోదరుడిపై కీలక నిర్ణయం తీసుకున్నాడు. అండ్రు కు ఉన్న అతను అర్హతలను మొత్తం తొలగించాడు. బలవంతంగా ఇంట్లో నుంచి గెంటించాడు. ఇదే విషయాన్ని బకింగ్ హం ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

చార్లెస్ దివంగత రెండవ ఎలిజిబెత్ కుమారుడు. చార్లెస్ తమ్ముడే ఆండ్రు. జెప్రీ ఎప్ స్టైన్( Jeffrey Epstein) సె** కుంభకోణంలో కీలక పత్రాలు వెలుగు చూశాయి. అందులో ఆండ్రు పేరు బయటికి వచ్చింది. అప్పటినుంచి ఆయన తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నారు. రాజకుటుంబంలో వ్యక్తి ఇలా చేయడంతో బ్రిటన్ మీడియా ప్రధానంగా కథనాలు రాసింది. తినే పద్యంలో ఆండ్రు తన రాయల్ టైటిల్ డ్యూక్ ఆఫ్ యార్క్ ను వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాదు అతనికున్న అర్హతలు.. మర్యాదలు.. బిరుదులను చార్లెస్ తొలగించాడు. అంతేకాదు లండన్ ప్రాంతంలో ఉన్న విండ్సర్ ఎస్టేట్ మొత్తానికి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆండ్రు తూర్పు ఇంగ్లాండ్ ప్రాంతంలోని సాండ్రింగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్లోకి వెళ్తారని తెలుస్తోంది.

తనపై వస్తున్న అభియోగాలు కుట్రపూరితంగా చేర్చారని ఆండ్రు చెబుతున్నప్పటికీ చార్లెస్ వినిపించుకోలేదని ప్రచార జరుగుతోంది. రాజ కుటుంబం కావడంతో ప్రజల దృష్టిలో తప్పుడు పనులు చేసిన వారిగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చార్లెస్ పేర్కొన్నట్టు బ్రిటన్ మీడియా చెబుతోంది. చార్లెస్, ఆయన భార్య కెమిల్లా ఈ కుంభకోణంలో బాధితుల వైపు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కుంభకోణంలో అగ్రరాజ్యం లో ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికాకు చెందిన ఓ యువతి ఆండ్రు పై అనేక రకాలుగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆండ్రు తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ఇటీవల ఆ యువతి ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తక విడుదల సమయంలో ఆండ్రు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత అతని పేరు అటు అమెరికా నుంచి మొదలుపెడితే బ్రిటన్ మీడియా వరకు మారుమోగిపోయింది. అందువల్లే ప్రిన్స్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular