Bigg Boss 9 Captain Divya: ట్విస్టుల మీద ట్విస్టులు..ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఆడియన్స్ ని రోజుకో విధంగా సర్ప్రైజ్ కి గురి చేస్తూ ముందుకు వెళ్తోంది. వారాలు గడిచే కొద్దీ హౌస్ లో జనాలు తగ్గిపోవాలి. కానీ ఇక్కడ ప్రతీ వారం జనాలు పెరుగుతూ పోతున్నారు. వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని కాసేపు పక్కన పెడితే, ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి గత రెండు వారాల్లో ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో భరణి ఆడియన్స్ పోలింగ్ తో పాటు, హౌస్ లో జరిగిన టాస్కులు గెలిచి, బిగ్ బాస్ హౌస్ లో శాశ్వతమైన సభ్యుడిగా మారిపోగా, శ్రీజ మాత్రం ఎలిమినేట్ అయ్యింది. అయితే భరణి టాస్కులు గెలవడానికి ముఖ్య కారణంగా నిల్చిన వారిలో దివ్య ఒకరు. ఆ తర్వాత చివర్లో ఇమ్మానుయేల్ అద్భుతంగా గేమ్ ఆడి, భరణి ని గెలిపించి గేమ్ చేంజర్ గా నిలిచాడు.
అయితే నిన్న హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగిందట. మంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ కెప్టెన్సీ టాస్క్ లో దివ్య గెలుపొంది, హౌస్ కి కొత్త కెప్టెన్ గా మారిందట. అయితే కెప్టెన్ అయ్యాక హౌస్ లో చాలా జరిగాయట. మొదటి నుండి దివ్య కి తనూజ అంటే పడట్లేదు. కెప్టెన్ అయ్యాక ఆమె తనూజ పై కొన్ని విషయాల్లో కోపం తెచ్చుకోవడం, దానికి తనూజ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం వంటివి చేసిందట. అలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచిందని టాక్. మరి వీళ్లిద్దరు ఎంతగానో ఇష్టపడే భరణి ఎవరి వైపు నిల్చుకున్నాడు?, అసలు వీళ్ళ మ్యాటర్ లో తలదూర్చాడా?, లేదా మనకి ఎందుకులే అని సైలెంట్ గా అలా చూస్తూ కూర్చున్నాడా అనేది చూడాలి. రేషన్ మ్యానేజర్ గా దివ్య ఉన్నప్పుడే చాలా గొడవలు జరిగాయి.
ఇక ఇప్పుడు ఆమె కెప్టెన్ అయ్యింది, హౌస్ లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి. 5వ వారం కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న దివ్య, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వరకు కచ్చితంగా ఉండేలా అనిపిస్తుంది. టాప్ 5 లోకి కచ్చితంగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఈమెకు పుష్కలంగా ఉన్నాయి. కానీ భరణి మీదున్న విపరీతమైన ప్రేమాభిమానాలు తగ్గించుకుంటే ఈమెకు టాప్ 5 స్పాట్ ఫిక్స్ అయిపోయినట్టే. లేదంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ఈమె హౌస్ మేట్స్ కి టాటా చెప్పి వెళ్లిపోవచ్చు. అంతే కాదు తనూజ మీద అనవసరమైన ద్వేషాన్ని కూడా ఈమె తగ్గించుకోవాలి. తనూజ కి ఈమెతో ఎలాంటి సమస్యలు లేవు,మంచిగానే మాట్లాడుతుంది. కానీ దివ్య మాత్రం మనసులో ఆమె పై చాలా కోపం పెట్టుకుంది. ఇదే కొనసాగితే ఫ్యామిలీ వీక్ వరకు ఉండడం కూడా సాధ్యం కాదని అంటున్నారు విశ్లేషకులు.