World’s Beautiful Cities : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ప్రశాంతత, పరిశుభ్రత, ధనికంగా, అందమైన నగరాలుగా పోటీ పాడాలన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. దేశాల్లో నేరాల ఆధారంగా ప్రశాంతమైన దేశాల జాబితాలు, ఆదాయం ఆధారంగా రిచెస్ట్ నగరాలను, క్లీన్‌నెస్ ఆధారంగా పరిశుభ్రమైన నగరాలను ఎంపిక చేస్తున్నాయి. తాజాగా అందమైన నగరాలను ప్రకటించాయి. ఇందులో ఫ్రాన్స్ రాజధాని, ప్యారిస్.. ప్రపంచంలోనే అందమైన నగరంగా గుర్తింపు పొందింది. నగరాల చారిత్రక నేపథ్యం, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు. ఇలాంటి నగరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
100 నగరాలు..
ప్రపంచ వ్యాప్తంగా 100 అందమైన నగరాలను ఎంపిక చేశారు. ఇందులో మొదటి స్థానంలో ప్యారిస్ ఉండగా, తర్వాతి స్థానంలో స్పెయిన్‌రాజధాని మాడ్రిడ్ ఉంది. జపాన్ రాజధాని టోక్యో మూడో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా అందమైన నగరాల జాబితాలో ఉన్నాయి. ఫ్రాన్స్ వరుసగా నాలుగో సారి అత్యంత ఆకర్షణీయమైన నగరంగా నిలిచింది.
మన రాజధానికి చోటు..
ఇక ప్రపంచంలో అత్యంంత ఆకర్షనీయమైన నగరాల జాబితాలో.. మన దేశం నుంచి ఒకే ఒక నగరానికి టాప్ 100 జాబితాలో చోటు దక్కింది. మన రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో 74వ స్థానంలో నిచింది. 98వ స్థానంలో జెరూసలెం, 99వ స్థానంలో జుహై, 100వ స్థానంలో కైరో నిలిచాయి. పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత, స్థిరత్వం వంటి అంశాల ఆధారంగా ఈ నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.
పారిస్‌లో ఇలా..
ప్యారిస్ ‘ప్రపంచ రణగతం‘ అని పిలువబడుతుంది. ఇది తన అందమైన స్మారకచిహ్నాలు, వాస్తు కళ మరియు రొమాంటిక్ వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది. ఎఫిల్ టవర్, లూవ్రే మ్యూజియం వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
న్యూయార్క్..
న్యూయార్క్ అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత నగరం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, టైమ్స్ స్క్వేర్, సెంట్రల్ పార్క్ వంటి ప్రదేశాలు ఈ నగరాన్ని అందంగా మారుస్తాయి.
సిడ్నీ..
సిడ్నీ హార్బర్ బ్రిడ్జి, సిడ్నీ ఓపేరా హౌస్ వంటి ప్రతిష్టాత్మక స్మారక చిహ్నాల వలన ప్రపంచ ప్రఖ్యాత నగరంగా నిలుస్తుంది.
రొమ్..
రొమ్, ఒక ప్రాచీన నగరం. ఈ నగరంలోని కోలీసియం, వాటికన్ సిటీ వంటి చరిత్రాత్మక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
టోక్యో
టోక్యో, ఆధునికత మరియు ప్రాచీనతను సమన్వయంగా కలిపి నిలుస్తున్న నగరం. దీని ఆధునిక సాంకేతికత, అందమైన ఆలయాలు మరియు ఫుడ్ కల్చర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది.