Pakistan rare earths deal: హీరామండి.. ఇది పాకిస్తాన్‌లోని అతిపెద్ద పట్టణమైన లాహోర్‌లోని ఒక ప్రాంతం. ఇక్కడ దేహాన్ని అమ్ముకుంటారు. ఈ పేరుతో పాకిస్తాన్‌ను చాలా మంది పిలుస్తారు. కారణం ఏమిటంటే పాకిస్తాన్ పాలకులు, సైనికులు కూడా హీరామండిలో దేహం అమ్ముకున్నట్లే వ్యవహరిస్తారు. తాజాగా పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమది హీరామండి ప్రభుత్వం అని నిరూపించుకుంది. తన భూభాగాలను విదేశీ పెట్టుబడులకు తెరిచి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు పొందుతూ, అంతర్జాతీయ సంబంధాలలో సమతుల్యత సాధిస్తోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలోని తీరప్రాంతాలు, సహజ వనరులు ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో 49 శాతం భూభాగం, 5 శాతం జనాభా కలిగి ఉంది. ఈ బలూచిస్తాన్ అరేబియా సముద్రంతో అతిపెద్ద తీరప్రాంతం కలిగి ఉంది. ఈ తీరం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆసియా, మధ్యప్రాచ్యం మధ్య వాణిజ్య మార్గాలకు ద్వారం. ఈ ప్రాంతంలో సహజ వనరులు, ముఖ్యంగా అరుదైన ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఎలక్ట్రానిక్స్, ఇంధన రంగాలలో అవసరమైనవి. పాకిస్తాన్ ఈ వనరులను విదేశీ దేశాలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించాలని భావిస్తోంది. రాగి, యాంటిమోనీ వంటి ఖనిజాలు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌లో ఉన్నాయి, వీటిపై చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు అమెరికా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ సరికొత్త ఆటకు తెరతీసింది.
తీరాల విక్రయం..
బలూచిస్తాన్‌లోని గ్వాదర్ తీరప్రాంతాన్ని ఇప్పటికే చైనాకు విక్రయించింది పాకిస్తాన్. గ్వాదర్ ఓడరేవు పాకిస్తాన్–చైనా ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో ముఖ్య భాగం. 2013లో ఒప్పందం ప్రకారం, చైనా ఈ పోర్టును అభివృద్ధి చేసి, ఆపరేట్ చేస్తోంది. ఇది అంతర్జాతీయ స్థాయి ఓడరేవుగా మార్చబడుతుంది. ఎయిర్‌బేస్‌గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా చైనాకు పాకిస్తాన్ ద్వారా మధ్య ఆసియా మార్గాలు తెరుచుకుంటాయి, పాకిస్తాన్‌కు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటీవల, గ్వాదర్‌ను ఆఫ్రికా వాణిజ్య మార్గాలతో అనుసంధానం చేసే ప్రణాళికలు కూడా ముందుకు వచ్చాయి ఈ సహకారం పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలకు సానుకూలమైనది, కానీ బలూచ్ స్వాతంత్య్ర ఉద్యమాలు ఇందులో విదేశీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
అమెరికాతో పస్ని ప్రపోజల్..
ఇదిలా ఉండగా బలూచిస్తాన్‌లోని పస్ని తీరంలోని ఓడరేవును అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ అమెరికాకు ప్రతిపాదన చేసింది. ఈ 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ద్వారా యూఎస్ ఇన్వెస్టర్స్ పోర్టును నిర్మించి, నిర్వహించవచ్చు. బలూచిస్తాన్ ఖనిజాలను ఎగుమతి చేయవచ్చు. ఇక్కడ పాక్ నావికా స్థావరం ఉన్నప్పటికీ, ఈ ఒప్పందం సైనిక ఉపయోగానికి కాదని స్పష్టం చేశారు. పస్ని నుంచి గ్వాదర్‌కు 70 కిలోమీటర్ల దూరమే. ఇరాన్‌కు సమీపంలో ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా కీలకం. ఇటీవల యూఎస్‌కు మొదటి ఖనిజ షిప్‌మెంట్ పంపడం ఈ సంబంధాలను బలపరుస్తుంది.
రెండు అగ్రదేశాలతో ఆటలు..
ఇది చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తుంది, కానీ పాకిస్తాన్ అధికారికంగా డినై చేస్తోంది. రెండు ఆగ్రదేశాలతో ఆట మొదలు పెట్టింది. క్రిటికల్ మినరల్స్, బహుముఖ భాగస్వామ్యాలు బలూచిస్తాన్ ఖనిజాలు పాకిస్తాన్ ఆర్థిక ఆయుధం. చైనాతో సైండక్ ప్రాజెక్ట్ వంటి భాగస్వామ్యాలు ఇప్పటికే స్థిరపడ్డాయి. అమెరికాతో 500 మిలియన్ డాలర్ల డీల్ ద్వారా పాలీ–మెటాలిక్ రిఫైనరీ స్థాపన జరుగుతుంది. సౌదీ అరేబియా వంటి ఇతర దేశాలతో కూడా సహకారాలు పెరుగుతున్నాయి, ఇది పాకిస్తాన్ బహుముఖ విదేశాంగ విధానాన్ని సూచిస్తుంది
ఈ భాగస్వామ్యాలు ఆర్థిక లాభాలు తెచ్చినప్పటికీ, స్థానిక ఆందోళనలు, పర్యావరణ ప్రభావాలు పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ ప్రభావాలు, సవాళ్లుఈ వ్యూహాలు చైనా–అమెరికా మధ్య శత్రుత్వాన్ని పాకిస్తాన్ సమతుల్యం చేస్తున్నట్లు కనిపిస్తాయి. గ్వాదర్ సమీపంలో ఇరాన్–భారత్ చాబహార్ పోర్టు ఉండటం వల్ల ప్రాంతీయ పోటీ పెరుగుతుంది. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఈ నిర్ణయాలలో కీలకం, కానీ బలూచ్ ఉద్యమాలు విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మొత్తంగా ఈ ఆట తాత్కాలిక లాభాలు తెచ్చినప్పటికీ, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. పాకిస్తాన్ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది.