Homeఅంతర్జాతీయంIsrael shock to Pakistan: పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌.. షాక్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌!

Israel shock to Pakistan: పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌.. షాక్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌!

Israel shock to Pakistan: పాకిస్తాన్‌కు, హమాస్‌ ఉగ్రవాద సంస్థకు చాలాకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే పాలస్తీనాకు అనుకులంగా పాకిస్తాన్‌ప్రజలు ఉంటారు. ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో నిరసనతులు కూడా తెలిపారు. అయితే ఇటీవల అమెరికాకు దగ్గరైన పాకిస్తాన్‌.. ఇప్పుడు అనివార్య పరిస్థితిలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. గాజా పునర్నిర్మాణం, హమాస్‌ను అంతం చేయడం కోసం ఏర్పాటు చేసే బృందంలో పాకిస్తాన్‌ చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. దీంతో పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అంగీకరించారు. అయితే పాకిస్తాన్‌ను గుర్తించని ఇజ్రాయెల్‌కు అనుమానం ఉంది. ఆ అనుమానమే నిజమైంది. పాకిస్తాన్‌ అటు హమాస్‌తో సన్నిహితంగా ఉంటూ.. ఇటు ఇజ్రాయెల్‌కు దగ్గర కవాలని చూస్తోంది. దీనిని గుర్తించిన ఇజ్రాయెల్‌ పాకిస్తాన్‌కు దౌత్యపరంగా షాక్‌ ఇచ్చింది.గాజా సమస్య పరిష్కారంలో పాకిస్తాన్‌ పాత్ర అనవసరం లేదని స్పష్టం చేసింది.

గాజా స్థిరీకరణ బలగాలు..
హమాస్‌ యూదులపై దాడి తర్వాత ఇజ్రాయెల్‌ తీవ్ర సైనిక చర్యలు చేపట్టి హమాస్‌ను దాదాపు నాశనం చేసింది. మిగిలిన ఉగ్రవాదుల ఆయుధాలను బలహీనపరచి, గాజా పునర్నిర్మాణానికి అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు (ఐఎస్‌ఎఫ్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసిమ్‌ మునీర్‌ ఇందుకు అంగీకరించి, యూఏఈతో కలిసి సైన్యం పంపాలని ప్రణాళిక వేశారు.

పాక్‌ వంకరబుద్ధి గుర్తింపు..
ఇజ్రాయెల్‌ పాక్‌ ద్వంద్వ వ్యూహాన్ని గుర్తించింది. గాజాలో తమకు అపరిచిత దేశ బలగాలు అవసరం లేదని ప్రకటించింది. భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూబెన్‌ అజర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ముందుకు సాగుతోందన్నారు.

పాక్‌లో హమాస్‌ నాయకుల పర్యటనలు
హమాస్‌ నాయకులు పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. జైష్‌–ఎ–మహ్మద్‌తో సమావేశాలు, నాజిజా వంటి నేతల పర్యటనలు జరుగుతున్నాయి. గతేడాది పీఓకే పరిదిలో హమాస్‌ నాయకులు తిరిగారు. ఈ సమాచారం ఇజ్రాయెల్‌ దృష్టికి వచ్చింది. హమాస్‌తో ఏకకాలంలో పనిచేసే పాక్‌కు ఐఎస్‌ఎఫ్‌లో చోటు ఇవ్వడం సమంజసం కాదని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది.

తుర్కీయే, ఖతార్‌ కూడా..
ఐఎస్‌ఎఫ్‌లో తుర్కీయే, ఖతార్‌ వంటి దేశాలు హమాస్‌పై సానుకూల వైఖరి చూపుతున్నాయి. ఇరాన్‌ నుంచి హమాస్‌కు ప్రధాన సహాయం వస్తోంది. ఖతార్‌లో హమాస్‌ కీలక నాయకులు ఆశ్రయం పొందారు. కొందరిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. పాక్‌ ద్వంద్వ వైఖరి దౌత్యపరంగా పెద్ద దెబ్బ తగిలింది.

రూబెన్‌ అజర్‌ ఇరాన్‌ తిరుగుబాటుపై కూడా స్పందించారు. అక్కడి ప్రస్తుత పాలన అంతమవుతుందా అనేది అనిశ్చితంగా ఉందని చెప్పలేదు. కానీ ప్రజలు పాలకులపై విసిగిపోయారని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version