https://oktelugu.com/

Pakistan Crimes : శవాలను వదలరారా.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు.. పాక్‌లో దారుణాలు..!

మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్‌లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌లో ముహమ్మద్‌ రిజ్వాన్‌ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2023 / 11:51 AM IST
    Follow us on

    Pakistan Crimes : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో అమ్మాయిలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అమ్మాయి కంటపడితే చాలు కామాంధులు చిత్తకార్తె కుక్కలకన్నా అధ్వానంగా వ్యవహరిస్తున్నారు. చివరకు ఆడవాళ్ల సమాధులను కూడా తవ్వి లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్లను కుక్కలతో పోల్చితే వాటిని కూడా అవమానించినట్లే అనిపిస్తుంది.

    తారాస్థాయికి లైంగిక వేధింపులు..
    పాకిస్థాన్‌లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా మహిళలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

    2011 నుంచే ఈ ఘటనలు..
    మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా అంటారు. పాక్‌లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌లో ముహమ్మద్‌ రిజ్వాన్‌ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. విచారణలో అతడే ఈ విషయాన్ని అంగీకరించాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    తాజాగా మళ్లీ వెలుగులోకి..
    ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో తాజాగా మళ్లీ శవాలపై లైంగికదాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ఇందుకు సంబంధించిన పాక్‌ మీడియా సంస్థ డెయిలీ టైమ్స్‌ తాజాగా ఓ వ్యాసం ప్రచురించడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘పాక్‌లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలను కూడా వదిలిపెట్టట్లేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి మర్యాదనైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా కంచెలు వేశారు. ఈ ఫొటో చూసి యావత్‌ దేశం సిగ్గుతో ఉరేసుకోవాలి’ అని డెయిలీ టైమ్స్‌ విచారం వ్యక్తం చేసింది. సమాధుల వద్ద ఇనుప కంచెలు వేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    40 శాతానికి పైగా మహిళలు..
    మానవ హక్కుల జాతీయ కమిషన్‌ గణాంకాల ప్రకారం.. పాక్‌లో దాదాపు 40 శాతానికి పైగా మహిళలు తమ జీవితకాలంలో కనీసం ఒకసారైనా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే అక్కడ మహిళలపై ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా మహిళల శవాలనూ వదలకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎక్కడ తయారయ్యార్రా మీరంతా.. మనుషులేనా.. పశువులు కూడా ఇలా వ్యవహరించవు కదరా.. అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.