Pakistan Debt Crisis 2026: పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ తగ్గుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక చమురు సంక్షోభం సరేసరి. ఇలాంటి పరస్థితిలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంక్షల కూరుకుపోయిన పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుంది. అందులో నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన దేశాలు రికవరీకి ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం విదేశీ రుణాలు 130 బిలియన్ డాలర్లు మించాయి. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఆర్థిక సంక్షోభంపై ప్రసంగిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు. మరోవైపు మిత్ర దేశాలు యూఏఈ, సౌదీ అరేబియా, చైనా వంటి మిత్రదేశాలు బిలియన్స్ డాలర్ల బకాయిలు చెల్లించమని డిమాండ్ చేస్తున్నాయి. ఇది పాక్‌కు అనూహ్య షాక్‌గా మారింది.
Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..
యూఏఈ తాత్కాలిక సాయం..
యూఏఈ పాకిస్తాన్‌కు గతంలో నగదు డిపాజిట్లు, పెట్రోలియం క్రెడిట్ లైన్ల రూపంలో బిలియన్స్ డాలర్ల సహాయం చేసింది. ఇప్పుడు ఈ రుణాలు బకాయిగా మారాయి. అయితే, యూఏఈ కొంచెం సహనంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు చెల్లింపు గడువు ఇచ్చింది. ఇది పాక్‌కు శ్వాస తీసుకునే సమయం ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక పరిష్కారం లేకపోతే ఒత్తిడి మరింత పెరుగుతుంది. యూఏఈ ఇస్లామాబాద్‌తో మంచి సంబంధాలు కాపాడుకోవడానికి ఈ దశ తీసుకుందని విశ్లేషకులు అంచనా.
సౌదీ అరేబియా ఒత్తిడి..
ఇక మరో గల్ప్ దేశం సౌదీ అరేబియా పాక్‌పై అత్యంత కఠినంగా ఉంది. యుద్ధ సహాయం చేయకపోవడంతో గతంలో ఇచ్చిన సుమారు 6.3 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో సౌదీ పాక్‌కు 3 బిలియన్ డాలర్లు డిపాజిట్ చేసి ఐఎంఎఫ్ రుణాలు రావడానికి సహాయం చేసింది. కానీ ఇప్పుడు రుణ రికవరీపై దృష్టి పెట్టింది. ఈ ఒత్తిడి పాక్ రిజర్వులను (సుమారు 9 బిలియన్ డాలర్లు) మరింత బలహీనపరుస్తోంది. సౌదీ తన స్వంత ఆర్థిక సంస్కరణలు (విజన్ 2030) కోసం ఇలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
బిల్లుల వసూలుకు చైనా ఒత్తిడి..
చైనా పాక్‌పై ఎనర్జీ రుణాల మీద ఒత్తిడి పెట్టింది. చైనా ఎనర్జీ కంపెనీకి చెల్లించాల్సిన సుమారు 220 మిలియన్ డాలర్లు చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పవర్ ప్లాంట్లతో ముడిపడి ఉన్నాయి’ పాక్ విద్యుత్ ధరలు భారీగా పెరిగి, పౌడర్ కట్స్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. చైనా మొత్తం 30 బిలియన్ డాలర్లు సీపీఈసీలో పెట్టుబడి పెట్టింది, కానీ రుణాలు తిరిగి రావాలని ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఇది పాక్ శక్తి రంగాన్ని మరింత డొలగడానికి దారి తీస్తోంది.
పాక్ జీడీపీ 2 శాతానికి దిగిపోయింది, ద్రవ్యోల్బణం 25% పైనుంది. రుణాలు జీడీపీలో 80 శాతం మించాయి. రుపీ విలువ పడిపోవడం, ఇంధన ధరలు పెరగడం, ఆహార ధరలు పెరగడంతో ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో గతంలో అప్పులు ఇచ్చిన దేశాలు సహాయం చేయడానికి ముందుకు రాకపోగా పాత అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది పాక్ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.
పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిన పాక్ కు షాక్ ఇచ్చిన యూఏఈ, సౌదీ అరేబియా, చైనా
ఆర్థిక సంక్షోభంపై ప్రసంగిస్తూ దాదాపు ఏడ్చినంత పని చేసిన పాక్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్
యుఏఈ, సౌదీ అరేబియా, చైనా బిలియన్స్ డాలర్ల బకాయిలను డిమాండ్ చేస్తున్నాయన్న పాక్ ప్రధాని
అప్పు తీర్చేందుకు ఈ ఏడాది… pic.twitter.com/66iPTuRXW1
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2026