Asim Munir: పాకిస్తాన్ ప్రస్తుతం మూడు వైపుల నుంచి భద్రతా ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆఫ్గానిస్తాన్‌తో సరిహద్దు ఘర్షణలు, మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడుల పర్యవసానాలు, మూడోవైపు అంతర్జాతీయ స్థిరీకరణ దళాల్లో పాల్గొనాల్సిన బాధ్యతలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సైలెంట్‌గా భారీ శుద్ధి ప్రారంభించారు. వంద నుంచి 150 మంది కీలక సైనికాధికారులను తొలగించారు, కొందరిపై కేసులు పెట్టారు, మరికొందరిని బలవంతంగా విరమణ చేయించారు.
తొలగింపులు ఇలా..
ఆసిమ్ మునీర్ తొలగించిన వారిలో మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్ 40 మంది సీనియర్ అధికారులు ఉన్నారు. కర్నల్స్, లెఫ్టినెంట్ కర్నల్స్ ను ఆసిమ్ తొలగిస్తున్నాడు. ఖాళీ అయిన స్థానాల్లో తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకునే అవకాశం ఉంది. సైనిక విశ్లేషకుడు, మాజీ మేజర్ ఆదిల్ రజా ఈ వివరాలను వెల్లడించారు. సాధారణంగా ఆర్మీలో మూడు ప్రధాన ఆరోపణలపై తొలగింపులు కొనసాగుతున్నాయి. గూఢచర్య సంస్థల హనీట్రాప్‌లో చిక్కుకున్న అధికారులను తొలగిస్తోంది. ఆర్థిక నేరాలు చేసినవారిని తొలగించింది. ఆసిమ్ మునీర్ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం కోర్ కమాండర్స్, ఐఎస్ఐ అధికారులను తొలగిస్తోంది.
కోర్ కమాండర్లపై వేటు..
పాకిస్తాన్ ఆర్మీలో నాలుగు కీలక కోర్ కమాండర్లు ఆసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. పెషావర్ కోర్ కమాండర్ (11వ కోర్)ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చే టీటీపీ దాడులను తట్టుకోవడంలో విఫలం అయ్యారని తొలగించాలని చూస్తున్నారు. బలూచ్ తిరుగుబాటును నియంత్రించడంలో విఫలంమైన మరో కోర్ కమాండర్‌పై అవినీతి ఆరోపణల వేసి తొలగించే ప్రయత్నం జరుగుతోంది. రావల్పిండి హెడ్‌క్వార్టర్స్ కోర్ కమాండర్ అధికార దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆసిమ్ మునీర్ అధికారాలను తగ్గించే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. 2025 సెప్టెంబర్‌లో 24 గంటల్లో 19 మంది సైనికులు మరణించారు. పెషావర్ కోర్ కమాండర్ ఈ దాడులను ఆపడంలో విఫలమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ సైన్యం ఇజ్రాయెల్–ఇరాన్, పాలస్తీనా ఘర్షణలపై అసంతృప్తితో ఉంది. ఇంటర్నేషనల్ స్టెబులైజేషన్ ఫోర్స్‌లో పాల్గొనాల్సిన ఒత్తిడి ఉంది.
ప్రధాన సమస్యలు..
ఐఎస్ఐ, ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ మధ్య సమన్వయ లోపం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో ఆర్మీపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక మాజీ సైనికాధికారులు కూడా పారిపోతున్నారు. ఇప్పటికే ఒకరు ఆసపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకరు దేశం విడిచి పారిపోయారు.
ఆసిమ్ మునీర్ వ్యూహం..
తొలగించబడిన అధికారుల స్థానంలో తనకు విధేయులైన అధికారులను నియమించే ప్రయత్నంలో ఆసిమ్ మునీర్ ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత మునీర్ అధికారం మరింత కేంద్రీకృతమైంది. 2023 మే 9న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాడు.
పాకిస్తాన్ ఆర్మీ చరిత్రలో ఇది అత్యంత కఠినమైన తొలగింపుగా పరిగణించబడుతోంది. మూడు వైపుల నుంచి భద్రతా ముప్పు ఉన్న సమయంలో 150 మంది కీలక అధికారులను తొలగించడం సాహసోపేతమైన నిర్ణయం. ఆసిమ్ మునీర్ తన అధికారాన్ని మరింత కేంద్రీకరించుకుంటూ, తనకు విధేయులైన అధికారులతో ఆర్మీని నింపే ప్రయత్నంలో ఉన్నారు. కానీ యుద్ధ సమయంలో అనుభవజ్ఞులైన అధికారులు లేకపోతే పాకిస్తాన్ భద్రతను ప్రమాదంలోకి నెడుతుంది.
