Pakistan Army Chief Asim Munir Controversy: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక పాకిస్తాన్ ఆటలో అరటిపండులా మారింది. ఇరాన్‌కు మద్దతు ఇవ‍్వలేని పరిస్థితి. అమెరికాతో కలిపి పోరాటం చేలయని దీనస్థితి.. ఇక డిఫెన్స్ డీల్ చేసుకున్న యూఏఈ, సౌదీ అరేబియాతో తరఫున ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేసే సాహసం చేయలేని దుస్థితి. దీంతో పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్‌పై దాడులు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. తెహ్రీక్ ఎ తాలిబాన్ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామంటూ సామానుయలపై దాడులు చేస్తోంది. యుద్ధం గురించి మొన్నటి వరకు ఏమీ మాట్లాడలేదు. కూడా కానీ, ఇటీల పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ షియా ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోని షియా సమాజంలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి.
మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమంలో ఆసిమ్ మునీర్, ఇరాన్‌కు మద్దతు ప్రదర్శించే షియా సముదాయాన్ని టార్గెట్ చేశారు. “ఇరాన్‌తో అధిక భావోద్వేగం ఉంటే అక్కడికి వలస వెళ్లండి” అని చెప్పి, వారి దేశభక్తిని సవాలు చేశారు. ఇఫ్తార్ సమావేశంలో ఇరాన్‌పై సానుభూతి చూపిన షియాలకు విదేశానికి వెళ్లమని సూచించడం వివాదాస్పదమైంది. ఇది గిల్గిట్-బల్కిస్తాన్ ప్రాంతంలో షియా ఆక్రోశాన్ని రగిలించింది.
ఆసిమ్‌పై ఉద్యమానికి పిలుపు..
రంజాన్ సందర్భంగా స్కార్దులోని ప్రముఖ షియా నాయకుడు అల్లామా షేక్ జావిద్, ఈద్ ప్రసంగంలో మునీర్ వ్యాఖ్యలను ఖండించారు. , ఆయనపై ఉద్యమం చేయాలని పిలుపునిచ్చాడు. పాక్ సైన్యంలో 3 లక్షల మంది షియా సైనికుల మానసిక స్థైర్యాన్ని ఆసిమ్ దెబ్బతీశారని పేర్కొన్నాడు. ఇది దేశ ఐక్యతకు ముప్పుగా మారిందని విమర్శించాడు. షియా ఉలేమా కౌన్సిల్ నాయకులు కూడా మునీర్‌ను అమెరికా-ఇజ్రాయెల్ పక్షపాతి అని ఆరోపించారు. షియాలు తల్చుకుంటే ఆసిమ్ పని ఖతం అవుతుందని హెచ్చరించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు..
ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు షియా ముస్లింలు ఎక్కువగా ఉండే గిల్గిట్-బల్కిస్తాన్‌లో ప్రాంతంలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. కరాచీలో ఇటీవల జరిగిన షియా ర్యాలీలపై భద్రతా దళాల కాల్పుల్లో 35 మంది మరణించారు. ఇది సున్నీ-షియా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇది ఫీల్డ్ మార్షల్‌కు మరో తలనొప్పిగా మారింది.
మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో మతపరమైన విభజనలను ఊతమిస్తున్నాయి. షియా సమాజం సహనం కోల్పోతే సైనిక అంతర్గత ఆందోళనలు పెరుగుతాయి. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశ స్థిరత్వానికే ముప్పు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఆసిమ్ దిగిరాక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.