Pablo Escobar : పాబ్లో ఎస్కోబార్ 1980 – 90ల మధ్యకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ కార్టెల్‌కు నాయకత్వం వహించిన కొలంబియాకు చెందిన పేరుమోసిన డ్రగ్ ట్రాఫికర్. అతడు నేరపూరిత చర్యల కారణంగా భారీగా డబ్బు కూడబెట్టాడు. దీని కారణంగా అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. అతని సంపద గురించి చాలా కథలు ఉన్నాయి. కానీ అతను ప్రతినెలా లక్షల రూపాయల విలువైన రబ్బరు బ్యాండ్లు కొనేవాడట.. వాటిని దేనికి ఉపయోగించేవాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. అదేంటో వివరంగా చూద్దాం. లక్షల రూపాయల విలువైన రబ్బరు బ్యాండ్లు ఎందుకు కొనేవాడని తెలిస్తే మనకు వింతగా అనిపించకతప్పదు. పాబ్లో ఎస్కోబార్ వద్ద కోట్లకు కోట్లు డబ్బులు ఉండేవి. చాలా రబ్బరు బ్యాండ్లను కొనుగోలు చేసేది వాటి కోసమే. ఎందుకంటే అతని వద్ద ఉన్న డబ్బులను లెక్కించడానికి, విడివిడి నోట్లుగా ఉంచడానికి అతడికి సరిపడా స్థలం లేకపోయేది. దీంతో అతను తన డబ్బును పెద్ద పెద్ద కట్టలుగా కట్టేవాడు.ఈ కట్టలు కట్టడానికి అతనికి పెద్ద సంఖ్యలో రబ్బరు బ్యాండ్లు అవసరం అయ్యేవి. ప్రతి వారం పాబ్లో ఎస్కోబార్ సుమారు 65 వేల డాలర్ల విలువైన రబ్బరు బ్యాండ్లను కొనుగోలు చేసేవాడని కొందరు తన గురించి తెలిసిన వారు చెప్తున్నారు.
పాబ్లో ఎస్కోబార్ వద్ద ఎంత మొత్తంలో డబ్బు ఉందో తెలిస్తే కంగు తినకమానరు. ఎంత పెద్ద మొత్తంలో అంతే వాటి కోసం పెద్ద పెద్ద గదులనే కేటాయించాల్సి వచ్చేది. అంత డబ్బు ఉంచుకోవడం పెద్ద ప్రమాదం కాబట్టి, దాన్ని దాచుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించేవాడు. రబ్బరు బ్యాండ్‌తో కట్టిన నోట్ల కట్టను దాచడం సులభం. తేమ కారణంగా డబ్బు చెడిపోవచ్చు. అందువల్ల, దానిని పొడి ప్రదేశంలో ఉంచడం అవసరం. రబ్బరు బ్యాండ్‌తో కట్టిన కట్ట సులభంగా పొడిగా ఉంచబడుతుంది.
పాబ్లో ఎస్కోబార్‌కు ఎంత ఆస్తి ఉంది?
2020 సంవత్సరంలో పాబ్లో మేనల్లుడు నికోలస్ తన పాత ఇంటి నుండి 18 మిలియన్ డాలర్లు అంటే 148 కోట్ల రూపాయలను పొందాడు. ఒక అంచనా ప్రకారం.. ఎస్కోబార్ మొత్తం సంపద 30 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 2.5 లక్షల కోట్లు. పాబ్లో వద్ద చాలా నగదు ఉందని అతని సోదరుడు రాబర్టో తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన నోట్లను అంటే సుమారు రూ. 16 వేల కోట్లను ఎలుకలు కొరికేవట. కొలంబియా ప్రభుత్వానికి పాబ్లో తలనొప్పిగా ఉన్నప్పటికీ, అక్కడి పేదలకు ఆయనో దూత. అమెరికా సైనికులు అతన్ని కాల్చి చంపినప్పుడు, అతని అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.