Suchir Balaji : ChatGPT మాతృ సంస్థ OpenAIలో భారత సంతతికి చెందిన పరిశోధకుడు సుచిర్ బాలాజీ ( 26) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఘటన గురించి అతని తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు. “OpenAI నా కొడుకును హత్య చేసింది.” అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. సుచిర్ వద్ద OpenAIకి వ్యతిరేకంగా కీలక ఆధారాలు ఉన్నాయని, కంపెనీ తన రహస్యాలను ఇతరులకు వెల్లడించకుండా నిరోధించడానికే అతన్ని హత్య చేశారని పూర్ణిమ ఆరోపించింది. పూర్ణిమ రావు యూఎస్ లో టక్కర్ కార్ల్సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వివరించారు. సుచిర్ బాలాజీ మరణంపై తల్లి పూర్ణిమారావు దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు.చాట్‌జిపిటి మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో నాలుగేళ్లు పరిశోధన చేసిన విజిల్‌బ్లోయర్ హత్యకు గురయ్యారని ఆమె ఆరోపించింది. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కొడుకు వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొంది. అందుకే అతన్ని చంపిందని ఆరోపించింది. ఇతరులు తమ రహస్యాలు తెలుసుకోవకూడదని కోరుకోవడం వల్లే తాను తన కొడుకును చంపారని ఆమె తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇటీవల అమెరికాలో టక్కర్ కార్ల్సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆమె తన కొడుకు మరణానికి గల కారణాలను అలాగే కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. తన కొడుకు మరణానికి ఒక రోజు ముందు తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడని తను తెలిపింది. అతను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఆ వేడుకను జరుపుకుంటాడా? ఆమె ప్రశ్నించింది. అతని ఉద్దేశ్యం ఆత్మహత్యే అయితే.. అతని తండ్రి ఇచ్చిన బహుమతులను అతను ఎందుకు స్వీకరిస్తాడు? ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కొడుకు వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె చెప్పింది.. “అందుకే అతనిపై దాడి చేసి చంపారు. నా కొడుకు మరణించిన తర్వాత, కొన్ని పత్రాలు కనిపించడం లేదు. Chat GPT క్రియేటర్స్ దర్యాప్తుపై తమ ప్రభావాన్ని చూపారు. ఈ విషయం తెలిసిన స్థానికులను వారు తమ వైపు ఉంచుకున్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. న్యాయవాదులు కూడా ఇది ఆత్మహత్య అని చెబుతున్నారు. కేవలం పద్నాలుగు నిమిషాల్లోనే, నా కొడుకు మరణాన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించారు. ” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఆమె ఇంటర్వ్యూ వీడియోను ఎలాన్ మస్క్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. దీని పై స్పందిస్తూ ఇది తీవ్రమైన విషయం అని ఆయన అన్నారు. బాలాజీ గత సంవత్సరం నవంబర్ 26న మరణించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో జరిగిన అతని మరణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు దీనిని ఆత్మహత్యగా ప్రకటించారు. అతని తల్లి పూర్ణిమ రావు దీనిపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు. తన కొడుకు మరణంపై సందేహాలు ఉన్నాయని.. ఆమె ఒక ప్రైవేట్ దర్యాప్తుదారుని నియమించి రెండవ సారి పోస్ట్‌మార్టం నిర్వహించింది. పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు వెల్లడయ్యాయి. అపార్ట్‌మెంట్ నుండి ఎవరో వస్తువులను దొంగిలించారని ఆమె పేర్కొంది. బాత్రూంలో గొడవ జరిగినట్లు సంకేతాలు ఉన్నాయి. రక్తపు మరకలు ఉన్నాయి. “ఎవరో ఆమెను కొట్టినట్లు అనిపిస్తుంది. అధికారులు ఈ దారుణ హత్యను ఆత్మహత్య అని పిలుస్తున్నారు. దీనిపై ఎఫ్‌బిఐ దర్యాప్తు చేయాలి” అని పూర్ణిమ రావు అన్నారు. ఈ వ్యాఖ్య పోస్ట్‌కి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదని అన్నారు.