Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పెరిగిపోతోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. పెళ్లిళ్లు, కర్మలకు పరిమితి సంఖ్యలోనే జనం ఉండేలా నిబంధనలు విధిస్తోంది. ఇరవై మంది కంటే ఎక్కువ ఉండొద్దని సూచిస్తోంది. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు మూసివేసేందుకు నిర్ణయించింది. మంగళవారం వెలుగుచూసిన కరోనా కేసులతో నగరాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు సూచనలు చేస్తున్నాయి.
24 గంటల వ్యవధిలోనే ముంబైలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో 1377 కేసులు, దేశ రాజధానిలో 496 కేసులు వెలుు చూడటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. భవిష్యత్ లో రాకాసి మరింత విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Also Read: తెలంగాణలో ‘ఒమిక్రాన్’ ఆంక్షలు.. వేడుకల్లేవ్.. ఇక ఇవి పాటించడం తప్పనిసరి
ఢిల్లీలో రెండు వారాల వ్యవధిలో 2-3 శాతం నుంచి 25-30 శాతానికి కేసులు పెరగడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో మూడో దశ ముప్పు వచ్చినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిబంధనలు విధిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.
రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో ప్రవేశంపై కూడా నిషేధం విధించడం తెలిసిందే. మరోవైపు ఆటో, క్యాబ్ ల్లో కూడా ఇద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో కరోనా నిబంధనలు మరోమారు వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
Also Read: కొత్త సంవత్సర సంబురం లేనట్టే?