Billionaires Dinner: మనకు నచ్చిన వారు మనతో ఉంటే కలిగే ఆనందమే వేరు.. ఇక మనం మెచ్చిన నటీనటులు.. క్రీడాకారులను అనుకోకుండా కలిసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇక వారితో కలిసి భోజనం చేసే అవకాశం వస్తే ఎంత అదృష్టమో అనిపిస్తుంది. అలాంటి ఛాన్‌స కట్టేశారు దక్షిణకొరియాలోని ఓ రెస్టారెంట్ కస్టమర్లు. ప్రపంచ టెక్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో ముందంజలో ఉన్న ముగ్గురు సీఈవోలు దక్షిణ కొరియాలోని ఒక సాధారణ రెస్టారంట్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు. దీంతో అప్పటికే హోటల్‌లో ఉన్న కస్టమరు.. ఈ దిగ్గజాలను చూసి షాక్ అయ్యారు. తము ఉన్న షమయంలో వచ్చినంతుకు లక్కీగా ఫీల్ అయ్యారు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఎవరో కాదు – ఎన్విడియా అధిపతి జెన్సన్ హువాంగ్, శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్ మరియు హ్యుందాయ్ మోటార్స్ చైర్మన్ చుంగ్ యుయి సన్.
శిఖరాగ్ర సదస్సులో పాల్గొని..
ఇద్దరు కొరియన్ వ్యాపారవేత్తలు, ఒక అమెరికన్–తైవానీస్ టెక్ ఐకాన్ – ఈ ముగ్గురు జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. అధికారిక భేటీల మధ్య విశ్రాంతి సమయాన్ని ఉపయోగించి, సుదీర్ఘ చర్చల తర్వాత వీరు సియోల్‌లోని ప్రముఖ క్యాన్బు చికెన్ రెస్టారంట్ వద్ద డిన్నర్ కోసం చేరుకున్నారు. సాధారణ ప్రజల మధ్య ఈ ముగ్గురు కనిపించడంతో అక్కడి వాతావరణం ఒక సెలబ్రిటీ ఫెస్టివల్‌లా మారింది.
సింపుల్ ఫుడ్, హ్యూమన్ జర్నీ
టేబుల్‌పై చీజ్ బాల్స్, స్టిక్స్, బోన్లెస్ చికెన్, ఫ్రైడ్ డిష్‌లు – సాధారణ వంటకాలు ఉన్నా, అక్కడి క్షణం ప్రపంచ టెక్ దిగ్గజాల మానవీయ వైఖరిని చూపించింది. ఈ ముగ్గురు చేపట్టిన చర్చలు వ్యాపారాల గురించి కాకుండా స్నేహం, సాధారణ జీవితం, మారుతున్న ప్రపంచ మార్కెట్ల గురించి కొనసాగినట్లు సన్నిహితులు చెబుతున్నారు. రెస్టారంట్ నుంచి బయటకు వచ్చే సమయంలో జెన్సన్ హువాంగ్ తన ప్రత్యేక ధోరణిలో అక్కడి కస్టమర్లందరికీ ఆహారం అందజేశారు. బయట వేచిచూస్తున్న పౌరులకు స్వయంగా చీజ్, ఫ్రైడ్ చికెన్ పంచారు. అనంతరం ఫ్యాన్లతో మాట్లాడి, సెల్ఫీలు దిగుతూ ఆత్మీయ పలకరించారు. తరువాతి క్షణాల్లో ఆయన చేసిన ప్రకటనతో అందరూ ముచ్చటపడ్డారు – ‘‘ఈ రెస్టారంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరి బిల్‌ని మేమే చెల్లిస్తాం’’ అంటూ హువాంగ్ ప్రకటించడంతో అక్కడి వాతావరణం కేరింతలతో మార్మోగిపోయింది. చివరగా హోటల్ సిబ్బందికి కృతజ్ఞత గుర్తుగా ప్రత్యేక బహుమతులు అందించారు.
సోషల్ మీడియా వైరల్..
ఈ డిన్నర్ డేట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరలయ్యాయి. టెక్, బిజినెస్ వర్గాల్లో మాత్రమే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఈ ఘటన సానుకూల చర్చకు దారితీసింది. అప్రతిహతమైన సంపద దక్కినా సరళత, వినయం ఎలా ఉంటుందో చూపిన ఉదాహరణగా ఈ సంఘటన గుర్తుండిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
When the CEOs of Nvidia, Samsung, and Hyundai meet and have a shot, you know the future is being negotiatedpic.twitter.com/5a973w3AhQ
— Dr Singularity (@Dr_Singularity) October 30, 2025