US Strategy To Catch North Korean Hackers: అమెరికా ఐటీ అవసరాలను భారత్, చైనా నిపుణులు మాత్రమే కాదు.. ఉత్తరకొరియా నిపుణులు కూడా తీరుస్తున్నారు. కొంతకాలంగా ఉత్తరకొరియా దేశానికి చెందినవారు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలలో చదువుతున్నారు. వారంతా ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోతున్నారు. సహజంగా మన నార్త్ కొరియా దేశస్థులలో కష్టపడి పనిచేసే తీరు అధికంగా ఉంటుంది. అందువల్లే అమెరికా కంపెనీలు వారికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి.
ఒకప్పుడు అమెరికా కంపెనీలు నార్త్ కొరియా నిపుణులకు భారీగా ఉద్యోగాలు ఇచ్చేవి. జీతాలు కూడా అదే స్థాయిలో సమకూర్చేవి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బుద్ధి ఉన్న నార్త్ కొరియా నిపుణులు.. అమెరికాలో పనిచేస్తూ.. అమెరికా కంపెనీలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. మొదట్లో అమెరికా కంపెనీలు ఈ పన్నాగాన్ని పసిగట్టలేదు. ఆ తర్వాత నార్త్ కొరియా ఐటీ నిపుణులు చేస్తున్న దుర్మార్గాన్ని గుర్తించిన ఐటీ కంపెనీలు.. వారిని బహిష్కరించాయి.
అమెరికాలో అమెరికా దేశస్తులు పనిచేయాలంటే ఎక్కువగా వేతనాలు చెల్లించాలి. అక్కడి లేబర్ చట్టాల ప్రకారం చెల్లింపులు జరిపాలి. కానీ నార్త్ కొరియా నిపుణులు అలా కాదు. తక్కువగా పని చేస్తారు. ఎక్కువ గంటలు పని చేస్తారు. అందువల్లే అమెరికా ఐటీ కంపెనీలు నార్త్ కొరియా నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డేటా దొంగిలించే అలవాటున్న నార్త్ కొరియా నిపుణులకు ముందుగానే కఠినమైన పరీక్ష పెడుతున్నాయి. అటువంటివారిని పట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
ఇటీవల టారోఐకూచి అనే ఐటి నిపుణుడిని అమెరికా కంపెనీ ఇంటర్వ్యూ చేసింది. అతడిని పరీక్షించడానికి ఒక టెస్ట్ పెట్టింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆ కంపెనీ హెచ్ఆర్ ఓ ప్రశ్న అడిగాడు..”మీరు చెప్పిన సమాధానాలు చాలా బాగున్నాయి. చివరిగా ఒక ప్రశ్న.. మీరు ఉత్తరకొరియా దేశానికి చెందినవారు కదా.. మీ దేశాధ్యక్షుడు కిమ్ ను లావు పంది అని తిట్టగలరా” అని అడిగాడు.. నార్త్ కొరియా ప్రజలు కిమ్ ను దేవుడిగా భావిస్తారు.. అతడిని లావు పంది అని తిట్టలేక టారో ఐకూచి దొరికి పోయాడు. అంతే కాదు, ఇంటర్వ్యూ మధ్య లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విచిత్రంగా కనిపిస్తోంది. నార్త్ కొరియా ఐటీ నిపుణులు దొంగలని.. సాఫ్ట్ సమాచారాన్ని తమ దేశానికి తరలిస్తారని.. అమెరికా కంపెనీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు సంతోషమని నెటిజన్లు అంటున్నారు.