No Kings Protests: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనపై ఏడాది తిరగకుండానే అమెరికాన్లు తిరుగుబాటు షురూ చేశారు. 2025, జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలు. అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ అందరిలో భయం సృష్టించారు. రోజురోజుకూ తన పరిధిని మించి నిర్ణయాలతో ఇటు అమెరికన్లు.. అటు ప్రపంచ దేశాలు నిత్యం భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయి. తన నిర్ణయమే ఫైనల్ అన్నట్లు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇదే తరుణంలో ట్రంప్ వేధింపులతో విసిగిపోయిన అమెరికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు.
‘నో కింగ్స్‘ పేరుతో ఉద్యమం..
అక్టోబర్ 18న అమెరికా అంతటా, అలాగే మిత్ర దేశాల్లోనూ ‘నో కింగ్స్‘ పేరుతో భారీ నిరసనలు జరిగాయి. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమంగా నిరసనకారులు పేర్కొంటున్నారు. దాదాపు 2,700 నగరాల్లో ఆందోళనలు జరగడం అమెరికా అధ్యక్షుడిపై వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇందులో సుమారు 70 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి ప్రేరణ.. 2016లో ప్రారంభమైన ’ఇండివైజబుల్’ అనే సంస్థ నుండి వచ్చింది, ఇది మొదట ట్రంప్ అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడింది. ఇప్పుడు, వేలాది సంస్థలు కలిసి ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, టీచర్స్ ఫెడరేషన్, మూవ్ ఆన్ వంటి సంస్థలు ఇందుకు తోడ్పడుతున్నాయి.
కొత్త నిరసన సూత్రం..
తాజాగా ఉద్యమకారులు.. ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో కనీసం 3.5 శాతం ప్రజలు స్థిరంగా వీధుల్లోకి దిగితే ప్రభుత్వం మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇది ఎరికా చెనోవెత్, మారియా స్టీఫెన్ వంటి రాజకీయ శాస్త్రవేత్తల పరిశోధన ఆధారంగా రూపొందించారు. ఈ సిద్ధాంతం ఉద్యమానికి శాస్త్రీయ చట్టబద్ధతను ఇచ్చినా, దానికీ పరిమితులు ఉన్నట్టు నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ట్రంప్ పాలనపై ప్రధాన ఆరోపణలు
ప్రజలు, స్వతంత్ర సంస్థలు ట్రంప్‌పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పాలనా తీరుపై అభ్యంతరాలు చెబుతున్నారు. వలసదారుల నిర్బంధం, బహిష్కరణను వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలపై ఆధిపత్యం చెలాయించడాన్ని నిరసిస్తున్నారు. నేషనల్ గార్డ్స్‌ను నగరాలకు నియమించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రజా ధనాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడంపై మండిపడుతున్నారు. కోర్టుల తీర్పులను లెక్కచేయకపోవడంపైనా జనాగ్రహం పెల్లుబిగుస్తోంది. పెట్టుబడిదారుల అనుకూల ఆర్థిక విధానాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నట్లు అమెరికన్లు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతోపాటు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వినియోగదారులపై విపరీమైన భారం పడుతోంది.
ట్రంప్ స్పందనపై మరింత ఆగ్రహం..
ఇక నిరసనలపై ట్రంప్ స్పందిస్తూ.. ’వాళ్లు నన్ను రాజు అంటున్నారు, కానీ నేను కాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ, ఆయన స్వయంగా షేర్ చేసిన ఏఐ వీడియో ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఆ వీడియోలో ఆయనను రాజుగా చూపిస్తూ నిరసనకారులపై దూషణ చేయడంపై జనం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా అధ్యక్షుడి భాషను కాకుండా, అహంకారంగా ప్రజలు భావిస్తున్నారు.
‘నో కింగ్స్‘ ఉద్యమం ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది.. వ్యక్తి పూజను వీడి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అమెరికా విభజన దశను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ప్రజల నిరసన శక్తి తక్షణ ప్రభావం చూపకపోయినా, ఇది ట్రంప్ సామ్రాజ్యాన్ని కూల్చి ఒక చారిత్రాత్మక మలుపు కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
New media post from Donald J. Trump
(TS: 18 Oct 21:32 ET) pic.twitter.com/11zWWNQniU
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) October 19, 2025