https://oktelugu.com/

Netherlands: ప్రపంచంలోనే పొడవైన ఆ దేశస్తులు పొట్టివాళ్లు ఎందుకవుతున్నారు?

Nedarlands: ప్రపంచంలో పొట్టి వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు ఆరడుగుల ఆజానుభావులు ఉండేవారని చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రపంచంలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా నెదర్లాండ్స్ కు గుర్తింపు ఉందని తెలిసిందే. కానీ రానురాను వారు పొడుగు తగ్గిపోతున్నారని చెబుతున్నారు. అయితే గత ఆరు దశాబ్దాలుగా ఈ దేశానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా పేరున్నా క్రమంగా అది తగ్గిపోతోంది. గత తరంతో పోలిస్తే రాబోయే తరం మరింత పొట్టిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 1980తో పోలిస్తే 2001లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 18, 2021 / 01:03 PM IST
    Follow us on

    Nedarlands: ప్రపంచంలో పొట్టి వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు ఆరడుగుల ఆజానుభావులు ఉండేవారని చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రపంచంలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా నెదర్లాండ్స్ కు గుర్తింపు ఉందని తెలిసిందే. కానీ రానురాను వారు పొడుగు తగ్గిపోతున్నారని చెబుతున్నారు. అయితే గత ఆరు దశాబ్దాలుగా ఈ దేశానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన జనాభా కలిగిన దేశంగా పేరున్నా క్రమంగా అది తగ్గిపోతోంది. గత తరంతో పోలిస్తే రాబోయే తరం మరింత పొట్టిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

    1980తో పోలిస్తే 2001లో పుట్టిన వారు పొట్టిగా ఉంటున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికి కూడా అత్యంత పొడవైన వ్యక్తులున్న దేశంగా నెదర్లాండ్స్ కు గర్తింపు ఉన్నా అది క్రమంగా మరుగునపడిపోతోంది. నెదర్లాండ్స్ లో 19 ఏళ్ల యువకుడి సగటు ఎత్తు 6 అడుగులు (182.9 సెం.మీ) కాగా, యువతి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలుగా ఉంది. 1980లో పుట్టిన తరంతో పోలిస్తే 2001లో పుట్టిన వారు సరాసరి 1 సెంటీమీటర్ ఎత్తు తగ్గుతున్నట్లు సమాచారం.

    మహిళలు 1.4 షెం.మీ మేర ఎత్తు తగ్గిపోతున్నారు. అయితే ప్రజల ఎత్తు తగ్గడానికి పలు కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. పౌష్టికాహార లోపంతో కూడా ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముందు తరానికి కంటే తరువాత తరం వారు ఎత్తు తగ్గిపోతున్నట్లు చెబుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు కూడా మరో కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    అయితే మనుషుల ఎత్తు తగ్గడానికి ఇంకా పలు రకాల కారణాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. 2007 ఆర్తిక సంక్షోభం కూడా దీనికి ఓ కారణం కావచ్చనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజల ఎత్తు క్రమంగా తగ్గిపోతోందని చెబుతున్నారు. దీనికి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికన్లు కూడా ఎత్తు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ దీనికి ఓ కారణమనే చెప్పాలి. సరైన డైట్ తీసుకోకపోవడం, ఎక్కువ క్యాలరీల ఆహారం లేకపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు.