https://oktelugu.com/

Nepal Bus Accident: ఉధృతంగా నది.. పడిపోయిన బస్సు.. ఆ మూల అంచున హాహాకారాలు.. ఈ విషాదం అంతులేనిది

విమాన ప్రమాదాలకు కేరాఫ్‌ నేపాల్‌. ఏటా కనీసం నాలుగైదు విమానప్రమాదాలు జరుగుతాయి. అయితే ఈ మధ్య నేపాల్‌లో పడవ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 23, 2024 / 05:33 PM IST

    Nepal Bus Accident(1)

    Follow us on

    Nepal Bus Accident: నేపాల్‌.. పూర్తిగా హిందూ దేశమైన ఇక్కడ అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. భారత్‌కు చెంఇన అనేక మంది దైవ దర్శనాల కోసం నేపాల్‌ వెళ్తుంటారు. హిమాలయాలకు అవలివైపు ఉన్న నేపాల్‌ వాతావరణ పరిస్థితి కారణంగా ఇక్కడ విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఖాట్మండు ఎయిర్‌ పోర్టులోని టేబుల్‌ రన్‌వే కారణంగా విమానాలు అదుపుతప్పుతున్నాయి. ఇక ల్యాండింగ్‌ సమయంలో అక్కడి వాతావరణంలో జరిగే మార్పులు కూడా విమాన ప్రమాదాలకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. హిమాలయాల్లో నదులు కూడా ఎక్కువే. అక్కడి ప్రజలు నదీ ప్రయాణలు కూడా చేస్తుంటారు. హిమాలయాలకు సమీపంలో ఉండడంతో ఏడాదంతా ఇక్కడ నదులు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఈ క్రమంలో పడవ ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇక కొండల మీదుగా నేపాల్‌లో రోడ్డు మార్గాలు ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా నేపాల్‌లో రోడ్డు ఇలా ఉంటాయి. ఏమాత్రం డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఉన్నా.. వాహనాలు అదుపు తప్పి కిందపడతాయి. ఇలా ఇప్పటికే అనేక బస్సు ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బస్సు నేపాల్‌లో ప్రమాదానికి గురైంది.అదుపుతప్పి నేపాల్‌లోని తానాహున్‌ జిల్లాలో మార్సాంగ్డీ నదిలో పడిపోయింది. వరద ఉధృతికి ఒడ్డు కొట్టుకుని వచ్చింది.

    టూరిస్టులతో బయల్దేరిన బస్సు…
    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు యాత్రికులతో నేపాల్‌ వెళ్లింది. గురువారం రాత్రి యాత్రికులు పోఖారాలోని మజేరి రిసార్ట్‌లో బస చేశారని, శుక్రవారం ఉదయం పొఖారా నుంచి నుంచి ఖాట్మండుకు శుక్రవారం(ఆగస్టు 23న) వెళ్తుండగా మధ్యలో తానాహున్‌ జిల్లాలోని మార్సాంగ్డి నదిలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతిచెందినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే.

    కొనసాగుతన్న సహాయక చర్యలు..
    బస్సు నదిలో పడిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. మరో 16 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మాధవ్‌ పాడెల్‌ నేతృత్వంలోని 45 మంది పోలీసుల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.