Homeఅంతర్జాతీయంNepal new banknote deal: చైనాతో దోస్తీ కోసం భారత్‌ కు నేపాల్‌ వెన్నుపోటు..

Nepal new banknote deal: చైనాతో దోస్తీ కోసం భారత్‌ కు నేపాల్‌ వెన్నుపోటు..

Nepal new banknote deal: భారతదేశం–నేపాల్‌ మధ్య దశాబ్దాలుగా సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక సంబంధాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం తరచూ సహాయం అందిస్తూ నేపాల్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రత్యేకంగా 1950లో సంతకం అయిన భారత–నేపాల్‌ శాంతి, సన్నిహిత స్నేహం ఒప్పందం ఈ సంబంధాలకు ప్రాముఖ్యతనిచ్చింది. ఇందులో రెండు దేశాల సార్వభౌమ్యత, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించే అంశాలు స్పష్టం చేయబడ్డాయి.

ఉచితంగా సముద్ర, రోడ్డు మార్గాలు..
భారత్‌ నేపాల్‌కు భూమి, సముద్ర మార్గాలను ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించింది. కోల్‌కతా, విశాఖపట్నం పోర్టులను నేపాల్‌ ఉచితంగా వినియోగించుకుంటుంది. ఇక రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు కూడా ఉచితంగానే సాగుతున్నాయి. 2015లో నేపాల్‌లో వచ్చిన పెద్ద భూకంప కాలంలో వందల కోట్ల రూపాయల రకరకాల సాయం భారత్‌ అందించింది. భారత ప్రభుత్వ ఉద్యోగాలలో నేపాల్‌ పౌరులకు అవకాశాలు ఇవ్వడం వంటి చర్యలతో సహకారం కొనసాగింది.

చైనాతో దోస్తీ కోసం..
తాజాగా నేపాల్‌ చైనా నుంచి ఆర్థిక సహాయం అందుకునేందుకు ఎక్కువ దృష్టి పెట్టింది. నేపాల్‌ కరెన్సీని ముద్రించే టెండర్‌ను చైనాకు అప్పగించింది. చైనా ముద్రించిన రూపాయలపై భారత భూభాగాలను నేపాల్‌ భూభాగంగా చూపించింది. దీనిని నేపాల్‌ సెట్రల్‌ బ్యాంకు ముందుగా అప్రూవ్‌ చేయాలని, పొపపాటు ఉన్నా కూడా నేపాల్‌ అభ్యంతరం చెప్పకుండా మన భూభాగాలు నేపాల్‌కు చెందినవిగా చూపుతూ ముద్రించిన మ్యాప్‌కు ఓకే చెప్పింది. ఇది భారత–నేపాల్‌ మధ్య ఉన్న పరస్పర గౌరవం, సహకర ప్రమాణాలను ఉల్లంఘన అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సరిహద్దు వివాదాలు..
భారత్, నేపాల్‌ సరిహద్దుల్లో కొద్ది భాగాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలను పరస్పర చర్చలు, రాజకీయ మౌలికత్వంతో పరిష్కరించడం అవసరం. భారత్‌–నేపాల్‌ సహజ సంబంధాల పరిరక్షణ కోసం మరింత సవాలులను దాటుతూ, మైత్రి పునరుద్ధరణకు సహకరించాలని సూచన. భారత సహాయం, మైత్రి భావనలను నేపాల్‌ గౌరవించాల్సిన సమయం ఇది.

నేపాల్‌ తన స్వతంత్ర విదేశీ విధానంలో చైనా వైపు ప్రయాణిస్తున్నప్పటికీ, భారతదేశంతో ఉందని భావించే సహకారాన్ని నిలుపుకోవడం పరస్పరం లాభాలను పెంచుతుంది. ఈ వ్యవహారంలో ఒక దేశపు ఇతర దేశాల సహాయాన్ని సులభంగా విస్మరించడం రాజకీయం, ప్రాంతీయ స్థితిగతుల పరంగా పాజిటివ్‌ కాని ఫలితాలు తెస్తుంది. సహజ సంబంధాలను మరింత బలపరచడానికి ప్రభుత్వాలు, ప్రజలు సంఘర్షణకు లొంగకుండా సహకార నిర్మాణాలను అభివృద్ధి చేయాలి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version