Parker Solar Probe : నాసా ప్రయోగించిన “పార్కర్ సోలార్ ప్రొబ్” సూర్యుడి వద్దకు అత్యంత దగ్గరగా వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి అంతే సురక్షితంగా బయటికి వచ్చింది.. ఈ ఘనత అందుకున్న తొలి వ్యోమ నౌక గా “పార్కర్ సోలార్ ప్రొబ్” రికార్డు సృష్టించింది.
ఈ వ్యోమ నౌక ఏం చేస్తుందంటే?
సూర్యుడి గురించి తెలుసుకోవడానికి నాసా 2018 లోనే “పార్కర్ సోలార్ ప్రొబ్” ను ప్రయోగించింది. అంతరిక్షంలో ఉన్న వాతావరణం.. సూర్యుడిపై ఏర్పడుతున్న తుఫాన్లు, మంటల గురించి మరింతగా తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని నాసా చేపట్టింది. ఈ ప్రయోగం వల్ల భూ కక్ష్యలోని ఉపగ్రహాలు, భూమి మీద ఉన్న విద్యుత్ గ్రిడ్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సమాచార వ్యవస్థలపై ఇది ప్రభావం చూపిస్తుంది. అయితే దీనిపై విస్తృతమైన పరిశోధనలు చేసి.. భవిష్యత్తు కాలంలో చోటుచేసుకునే విపత్తుల గురించి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. నాసా ప్రయోగించిన ఈ వ్యోమ నౌక ఏడు సంవత్సరాల పాటు పని చేస్తుంది. భానుడిపై ఉపరితల ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల వరకు ఉంటుంది. సూర్యుడి బయటి వాతావరణంగా పేరుగాంచిన కరోనాలో ఉపరితల ఉష్ణోగ్రత 40 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. అయితే కరోనా ప్రాంతంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కలవడానికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. దీని గురించి తెలుసుకోవడానికే “పార్కర్ సోలార్ ప్రొబ్” ప్రయోగాన్ని నాసా చేపట్టింది. దానిని ఏకంగా కరోనా వద్దకు పంపించింది. అమెరికా ప్రయోగించిన ఈ వ్యోమ నౌక అనేకసార్లు సూర్యుడి వద్దకు వెళ్ళింది.
ఇలా రక్షణ చర్యలు
కరోనా వద్దకు “పార్కర్ సోలార్ ప్రొబ్” వెళ్లడానికి అనవుగా నాసా అనేక రక్షణ చర్యలు తీసుకుంది. “పార్కర్ సోలార్ ప్రొబ్” లో అధునాతన మార్పులు చేపట్టారు. తాజా టెక్నాలజీ ప్రకారం ఇందులో రక్షణ చర్యలు చేపట్టారు. 11.5 సెంటీమీటర్ల మందం ఉన్న కార్బన్ కాంపోజిట్ రూపంలో కవచాన్ని నాసా ఏర్పాటు చేసింది.. దీనివల్ల సూర్యుడి వేడి నుంచి వ్యోమ నౌక రక్షించుకుంటుంది… అంతేకాకుండా ఇందులో ఏర్పాటు చేసిన కప్, ఇతర పరికరం సూర్యుడి మీద అత్యంత వేగంగా నమూనాల సేకరిస్తాయి.. ఇవి అత్యంత వేడిని తట్టుకుంటాయి.. అత్యంత భార లోహాలతో రూపొందాయి . ఇవి తీసుకొచ్చిన నమూనాల ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు. గతంలో చోటు చేసుకున్న పరిస్థితులను.. ప్రస్తుతం అంతరిక్షంలో జరుగుతున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత అది మానవాళి మీద చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. దీనివల్ల భవిష్యత్ కాలంలో చోటు చేసుకోబోయే విపత్తుల గురించి ముందే తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Parker Solar Probe has made history.
After seven days of silence, Parker has resumed communication with Earth, confirming it’s healthy after soaring just 3.8 million miles from the solar surface — the closest a human-made object has ever been to a star.https://t.co/YgLBDsRlGy pic.twitter.com/UMCNq0BzhA
— NASA Sun & Space (@NASASun) December 27, 2024