https://oktelugu.com/

Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఎప్పుడు వస్తుంది? నాసా సమాధానం ఇది..

జూన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. స్టార్ లైనర్ లో వచ్చిన లోపాలతో స్పేస్ ష్టేషన్ లో ఉండిపోయారు. అయితే వారిని కిందికి తీసుకువచ్చేందుకు శాస్త్ర్రవేత్తలు అన్న చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం అసలు విషయాలను ప్రకటించనున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 2:33 pm
    Sunita Williams and Butch Wilmore

    Sunita Williams and Butch Wilmore

    Follow us on

    Sunita Williams : జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వ్యోమగాములను చిక్కుకున్నారు. వాస్తవారిని వారి మిషన్ ఎనిమిది రోజుల్లో కంప్లీట్ అయ్యి తిరిగి భూమిపైకి రావాలి. అయితే సాంకేతిక పరిస్థితులు తలెత్తడంతో తిరిగి రాలేదు. వారిని తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు బోయింగ్ కొత్త క్యాప్సూల్ రూపొందించారు. అయితే అది తగినంత సురక్షితంగా ఉందో లేదో అన్న విషయాలు ఈ వారాంతంలో తెలుస్తుందని ‘నాసా’ గురువారం (ఆగస్ట్ 22) తెలిపింది. అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయంపై శనివారం (ఆగస్ట్ 24) సమావేశం అవుతారని, ఈ సమావేశం ముగిసిన తర్వాత హ్యూస్టన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ లో బయలుదేరారు. ఈ టెస్ట్ ఫ్లైట్ లో థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హీలియం లీకేజీలు, తదితర అంశాల కారణంగా ఏం చేయాలో తెలియక ఇంజినీర్లు తర్జన భర్జన పడుతుండగా నాసా ఈ క్యాప్సూల్ ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో నిలిపి ఉంచింది. ఈ క్యాప్సూల్స్ లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయితే, స్పేస్ ఎక్స్ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు, కానీ అది ఫిబ్రవరి, 2025 వరకు సాధ్యం కాదు. వారం తర్వాత వారు స్టేషన్ కు రావాల్సి ఉంది.

    సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కు 96 గంటల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో చిక్కుకుపోవచ్చని ఒక నిపుణుడు చెప్పారు. స్టార్‌లైనర్ వ్యోమనౌక తప్పుడు కోణంలో భూమి వైపు ప్రయాణం చసేందుకు ప్రయత్నిస్తే అది వాతావరణాన్ని ఢీకొట్టి, కక్ష్యలో తిరిగి ఉండవచ్చని US సైనిక అంతరిక్ష వ్యవస్థల మాజీ కమాండర్ రూడీ రిడోల్ఫీ మీడియాతో అన్నారు. సునీత, బుచ్ కేవలం 96 గంటల ఆక్సిజన్ సరఫరాతో అంతరిక్షంలో ఒంటరిగా ఉండగలరని రిడాల్ఫీ చెప్పారు. అదే సమయంలో మరో రెండు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.

    స్పేస్ ఎక్స్ ఒక్కటే వారిని భూమి మీదకు తీసుకువస్తుందని నిర్ణయిస్తే స్టార్ లైనరల్ సెప్టెంబర్ లో ఖాళీగా భూమిపైకి తిరిగి వస్తుంది. స్టార్ లైనర్ థ్రస్టర్ల కోసం కొత్త నమూనాను ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. యూఎస్ పశ్చిమ ఎడారిలో ల్యాండింగ్ కోసం క్యాప్సూల్ కక్ష్య నుంచి దిగుతున్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయి. నవీకరించిన రిస్క్ విశ్లేషణలతో సహా ఫలితాలు తుది నిర్ణయానికి దారితీస్తాయని నాసా తెలిపింది.

    అంతరిక్షంలో, నేలపై థ్రస్టర్లను విస్తృతంగా పరీక్షించడం వ్యోమగాములను సురక్షితంగా తిరిగి ఇచ్చే స్టార్ లైనర్ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని బోయింగ్ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. క్యాప్సూల్ సమస్యల కారణంగా ఏళ్ల తరబడి ఆలస్యమైన కంపెనీ తొలి వ్యోమగామి ప్రయాణం ఇది. ఇంతకు ముందు రెండు స్టార్ లైనర్ టెస్ట్ ఫ్లైట్లలో ఎవరూ లేరు. స్పేస్ షటిల్స్ రిటైర్ అయిన తర్వాత, నాసా తన వ్యోమగాములను స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు దశాబ్దం క్రితం బోయింగ్, స్పేస్ ఎక్స్ లను నియమించింది. స్పేస్ ఎక్స్ 2020 నుంచి ఈ సంస్థలో ఉంది.

    వారిని తిరిగి తీసుకురాకపోతే ఏం చేస్తారు..?
    స్టార్‌లైనర్ వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి పంపించే సామర్థ్యం లేదని భావించినట్లయితే.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వద్ద డాక్ చేయబడిన, అత్యవసర పరిస్థితుల్లో అదనపు వ్యోమగాములకు వసతి కల్పించే స్పేస్‌ ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వారిని తిరిగి పంపిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇది అసంభవనంగా కనిపిస్తుంది. ప్రస్తుత అంచనాలు అవసరమైతే స్టార్‌లైనర్ ఇప్పటికీ ఎస్కేప్ పాడ్‌గా పనిచేస్తుందని సూచిస్తున్నాయి.