MrBeast Charity Livestream: మనం చేసే పని గొప్పగా ఉండాలి. దాని గొప్పతనం ఇతరులకు వెంటనే అర్థం కావాలి. అప్పుడు మన గురించి ప్రపంచం గొప్పగా చూస్తుంది. గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటి పనే ఇతడు చేశాడు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని రికార్డును సృష్టించాడు. కేవలం ఒకే ఒక్క లైవ్ స్ట్రీమింగ్ తో ప్రపంచ ఘనతను సాధించాడు.
సామాజిక మాధ్యమాలలో అత్యధిక అనుచర గణాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా మిస్టర్ బీస్ట్ సుపరిచితుడు. యూట్యూబ్ ద్వారా అతడు సంపాదించిన సంపాదనలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటాడు. గృహాలు లేని వారికి ఇళ్లు కట్టిస్తుంటాడు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి సహాయం చేస్తుంటాడు. ఆకలితో బాధపడే చిన్నారుల క్షుద్బాధను తీర్చుతుంటాడు. ఇతడు చేసే సేవలను కోట్లమంది అభినందిస్తుంటారు. అతడు చేసే ప్రతి పనికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తుంటారు. ఇటీవల ఒక చారిటీ కోసం అతడు ఒక లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. తనను అనుసరించే వారు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని అతడు కోరాడు. దీనికి భారీగా స్పందన వచ్చింది.
ఈ చారిటీ కార్యక్రమానికి సంబంధించి అతడు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా అతడిని అనుసరించేవారు కూడా తమ వంతు తోడ్పాటు అందించారు. తద్వారా 105 కంటే ఎక్కువ కోట్ల నిధులు వచ్చాయని మిస్టర్ బీస్ట్ ట్విట్టర్ ఎక్స్ లో వెల్లడించాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా సేకరించిన విరాళాల్లో ఇదే అత్యధికమని బీస్ట్ వెల్లడించాడు. అయితే ఈ చారిటీ ద్వారా వచ్చిన నిధులను సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తానని బీస్ట్ పేర్కొన్నాడు. అయితే అతడు చెప్పిన సమాచారం ప్రకారం ఈ నగదు మొత్తాన్ని విద్య, పారిశుద్ధ్యం, వసతుల కల్పన కోసం వినియోగిస్తాడని తెలుస్తోంది. అతని ద్వారా లబ్ధి పొందిన వారంతా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. వాస్తవానికి యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన చాలామంది తమ సొంత ఆస్తులను పెంచుకుంటున్నారు. కానీ మిస్టర్ బీస్ట్ మాత్రం అలా కాదు.. బలమైన సామాజిక మాధ్యమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో తను చేసే సేవా కార్యక్రమాల కోసం నగదు సరిపోని పక్షంలో తనను అనుసరించే వారి సహాయాన్ని కోరుతున్నాడు. అతడు సేకరించిన ప్రతి పైసాకు లెక్క చెబుతాడు. అంతేతప్ప మోసానికి పాల్పడడు. యూట్యూబ్లో అత్యధికమంది ఫాలోవర్స్ కలిగి ఉన్నప్పటికీ.. ఏనాడు కూడా బెట్టింగ్, ఇతర మోసపూరిత అప్లికేషన్లకు అతడు ప్రమోషన్ నిర్వహించలేదు.
మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త విషయాలను చెబుతుంటాడు. ఏ విషయంలోనూ రెండవ కోణాన్ని వ్యక్తం చేయడు. పైగా తన అభిప్రాయాన్ని జనాల మీద బలవంతంగా రుద్దడు. అందువల్లే అతడు అంటే చాలామంది ఇష్టపడతారు. అతడు తన ఛానల్ లో పోస్ట్ చేసే వీడియోలను అమితంగా ఇష్టపడుతుంటారు. అన్నట్టు మిస్టర్ బీస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది క్షణాల్లోనే కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంటుంది. కొద్దిరోజులపాటు యూట్యూబ్ లో ట్రెండింగ్లో ఉంటుంది. మిస్టర్ బీస్ట్ పోస్ట్ చేసిన ప్రతి వీడియో కోట్లల్లో వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
Just did my first stream and we raised over $12,000,000 for charity! Most money ever raised in a live stream pic.twitter.com/wT7YwP4qaC
— MrBeast (@MrBeast) August 15, 2025