Narendra Modi : మోడీ వెళ్లాడు.. మూడు రోజులపాటు యుద్దం ఆగిపోయింది.. ఆ తర్వాత అసలు కథ ఇప్పుడు మొదలైంది..

నాయకుడు గట్టివాడైతే.. సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. అప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న వ్యవస్థలు మొత్తం ఒక్కసారిగా జీ హుజూర్ అంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ చొరవతో జరుగుతున్నవి ఇవే.

Written By: Anabothula Bhaskar, Updated On : August 23, 2024 12:18 pm

Narendra modi- Puthin

Follow us on

Narendra Modi :  మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ రష్యా, పోలాండ్ పర్యటనలు చేశారు. ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోడీ అక్కడికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మోడీ పర్యటనను అమెరికా నిశితంగా పరిశీలిస్తే.. యూరప్ అదేపనిగా భూతద్దంలో పెట్టి చూసింది. అమెరికాకు భయపడకుండా.. యూరప్ ను లెక్కచేయకుండా భారత ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు.. ఇది అమెరికాకు నచ్చలేదు. వెంటనే తన అక్కసు బయటపెట్టింది. ఉక్రెయిన్ కూడా నర్మగర్భంగా ఏవో వ్యాఖ్యలు చేసింది. ఇక యూరప్ అయితే తన కడుపు మంటను మొత్తం బయటపెట్టుకుంది. దీంతో మన దేశంలో ఉన్న ఉదారవాదులకు ఎక్కడా లేని పని లభించింది.. మోడీ ఎలా చేస్తున్నారో చూస్తున్నారా అంటూ.. వారి నోటి నుంచి విమర్శల వాన మొదలైంది.. ఇక్కడ ఎలాగూ రాహుల్ గాంధీ ఉండనే ఉన్నాడు.. ఏం మాట్లాడుతాడో? ఎలా మాట్లాడుతాడో? అతడికే తెలియదు. ఓ వైపు అదానీ మీద మండిపడతాడు. అదే సమయంలో అతడి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందో రాహుల్ గాంధీకే తెలియాలి. సరే అది వేరే సబ్జెక్టు.. దానిని కాస్త పక్కన పెడితే.. మోడీ రష్యా పర్యటనను ఒక కోణంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూసింది. అమెరికా, యూరప్ కూడా అదే పని చేసింది. కానీ ఇక్కడే మోడీ వేసిన స్కెచ్ ను ప్రపంచం పసిగట్ట లేకపోయింది.

బలమైన రైల్ ఫోర్స్ వన్ రైలు లో మోడీ రష్యా నుంచి పోలాండ్ వెళ్లిపోయారు. దానిని అనుసరిస్తూ సైనిక విమానాలు.. అత్యాధునిక రాడార్లు.. ఫలితంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. వాస్తవానికి ఆ రెండు దేశాలు పరస్పర విజయాలు అంటూ వేరువేరుగా ప్రకటనలు చేసుకున్నాయి గాని.. అసలు విషయం ఏమిటో ఆ దేశాలకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలుసు. ఇక మోడీ వెళ్లిన పోలాండ్ ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి చెందింది.. మోడీ పోలాండ్ వెళ్లడంతో చెప్పాల్సినవన్ని చెప్పేసుకున్నామని సంతృప్తి నాతో దళాలకు దక్కింది. మరోవైపు తన బాధను, తమ ఆగ్రహాన్ని మోడీ అర్థం చేసుకున్నారని ఉక్రెయిన్ ప్లేట్ ఫిరాయించింది. ఇలా ఏకకాలంలో అటు రష్యాను మోడీ చల్ల బరిచారు. పోలాండ్ వెళ్లి యూరప్, అమెరికాను తన వైపు తిప్పుకున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఆయుధ వ్యాపార లాబీల నోరు మూయించారు. భారత ప్రసిద్ధి చూసి అక్కసు వెళ్ళగకుతున్న కిరాయి మీడియా గొంతుకు తాళం వేశారు. ఇలాంటి సందర్భాల్లో దేశ అంతర్గత వైఫల్యాలను ఎత్తిచూపేందుకు రాహుల్ గాంధీ వారు ఎలాగూ ఉండనే ఉంటారు. అయినప్పటికీ రష్యా మనకు ఆయిల్ ఇస్తూనే ఉంటుంది. మన ద్వారా యూరప్ కొనుగోలు చేస్తూనే ఉంటుంది. మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇంధన నిల్వలు పెరుగుతూనే ఉంటాయి. దీనినే ఎకనామిక్ పరిభాషలో యుద్ధ ఆర్థిక దౌత్యం అంటారు. ఇటువంటి విన్యాసాలను కేవలం శక్తివంతమైన నాయకులు మాత్రమే చేయగలుగుతారు. శక్తివంతమైన దేశాలు మాత్రమే అనుసరించ గలుగుతాయి. ఇప్పుడు భారత్ అంటే అమెరికా ముందు తల ఆడించే దేశం కాదు. పాకిస్తాన్ దాడి చేస్తే భయపడే దేశం కాదు. చైనా బెదిరిస్తే వణికిపోయే దేశం అంతకన్నా కాదు. స్థూలంగా చెప్పాలంటే దెబ్బకి దెబ్బ.. మాటకు మాట. అన్నింటికీ మించి ఏదైనా చేయగలిగే సమర్ధత.. అందుకే అంటారు బలమైన నాయకుడుంటే.. దేశం కూడా బలంగా మారుతుందని… ఇప్పుడు భారత్ ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ అమెరికాకు అర్థమైంది. పాకిస్థాన్ కు అనుభవంలోకి వచ్చింది. చైనాకు కళ్ళ ముందు కనిపిస్తోంది. కనిపించనిదల్లా రాహుల్ గాంధీకి మాత్రమే..