https://oktelugu.com/

Canada Vs India: కెనడా ప్రధాని ట్రూడోకు షాక్‌ ఇచ్చిన మోదీ.. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

రెండు మూడేళ్లుగా భారత్‌లో గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది కెనడా. తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్‌ ఇన్ని రోజులు సంయమనం పాటించింది. కానీ, ఈసారి మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 15, 2024 / 10:03 AM IST

    Canada Vs India

    Follow us on

    Canada Vs India: ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ సభ్యుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యను అడ్డం పెట్టుకుని కెనడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఉగ్రవాద సంస్థకు మద్దతు పలుకుతోంది. ఉగ్రవాది హత్య సాకుతో భారత్‌ను బద్నాం చేయాలని చూస్తోంది. ఈ విషయమై ఇప్పటికే భారత్‌ క్లారిటీ ఇచ్చింది. ఆధారాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. అయినా ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా.. తాజాగా మరోమారు నిజ్జర్‌ హత్య కేసులో భారత హై కమిషన్‌ హస్తం ఉందని ఆరోపించింది. దీంతో భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కెనడాలోని భారత దౌత్య వేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. మన దేశంలోని కెనడా దౌత్యవేత్తలపైనా వేటు వేసింది. అక్టోబర్‌ 19 నాటికి భారత్‌లోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

    మరోసారి తీవ్ర ఆరోపణ..
    ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు విషయంలో భారత్‌పై కెనడా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. భారత దౌత్యవేత్తలు సంజయ్‌కుమార్‌ వర్మతోపాటు పలువురు భారత దౌత్యవేత్తలను పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా కెనడా పేర్కొంది. ఈ విషయాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విఝయంలో కెనడా ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో కెనడా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఎలాంటా ఆధారాలు లేకుండా భారత్‌ హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది. భారత వ్యతిరేకులకు, ఉగ్రవాద సంస్థలకు ట్రూడో సర్కార్‌ ఇస్తున్న మద్దతుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.

    భారత దౌత్యవేత్తల బహిష్కరణ..
    కెనడా దౌత్యవేత్తలను భారత్‌ బహిష్కరించిన నేపథ్యంలో కెనడా కూడా ఆ దేశంలోని ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు తెలిసింది. భారత ప్రభత్వం అనుసరించిన విధానాల్లో ఆరుగురు భారత దౌత్యవేత్తలకు ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈమేరకు సాక్షాలు సేకరించినట్లు కెనడా పోలీసులు పేర్కొన్నారు.