https://oktelugu.com/

Modern Bamma: స్టన్నింగ్ లుక్స్‌లో 85 ఏళ్ల బామ్మ.. చూస్తే ఆహా అనాల్సిందే!

85 ఏళ్ల బామ్మ సరదాగా తయారైన లుక్స్.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చేశాయి. జాంబియాకు చెందిన మార్గరెట్ చోలా తన ఫ్యాషన్‌తో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసే మనువరాలు బామ్మను సరదాగా తయారు చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాషన్‌ ఐకాన్‌గా బామ్మ మారిపోయింది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2024 / 11:53 AM IST

    Modern bamma

    Follow us on

    Modern Bamma: టాలెంట్ ఎవరి అమ్మ సొత్తు కాదు.. టాలెంట్ ఉండాలే కానీ, అసలు వయస్సు, జెండర్ ఏదీ అవసరం లేదని నిరూపించింది ఓ 85 ఏళ్ల బామ్మ. ఈ మధ్య కాలంలో కొత్త ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియా ఎంతో మందిని స్టార్లుగా తీర్చిదిద్దింది. అయితే ఇటీవల ఓ 85 ఏళ్ల బామ్మ తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో రోజుకొకరు ట్రెండ్ అవుతుంటారు. వారు చేసే కొత్త కొత్త విన్యాసాలు, రీల్స్, ఫ్యాషన్ కారణంగా ఎవరు ఎప్పుుడు ట్రెండ్ అవుతారనే విషయం తెలియదు. అయితే ఈ 85 ఏళ్ల బామ్మ సరదాగా తయారైన లుక్స్.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చేశాయి. జాంబియాకు చెందిన మార్గరెట్ చోలా తన ఫ్యాషన్‌తో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసే మనువరాలు బామ్మను సరదాగా తయారు చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాషన్‌ ఐకాన్‌గా బామ్మ మారిపోయింది.

    స్టన్నింగ్ లుక్స్‌తో సన్ గ్లాసెస్ పెడుతూ.. ఫొటోలకు ఫోజులిస్తూ బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లెజెండరీ గ్రామా ఐడీతో ఆమె సోషల్ మీడియాలో వివిధ పోస్టులు పెట్టింది. ఈమె ఫ్యాషన్, కాన్ఫిడెన్స్ చూసి నెటిజన్లు ఈమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇంత వయస్సులో కూడా ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూపర్ అని అంటున్నారు. సరదాగా మనవరాలు చేసిన మేకర్ ఇప్పుడు ఆ బామ్మను ఓ సెలబ్రిటీలా మార్చేసింది. ఆమె డ్రసింగ్, ఆభరణాలు, గ్లాసెస్, లుక్స్, ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలా ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. భారీ సంఖ్యలో లైక్‌లు రావడంతో ఆ బామ్మ ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయింది. ఇప్పుడు ఈ బామ్మకు సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

    ఈ బామ్మకు పాత దుస్తులతోనే కొత్తగా ఫ్యాషన్‌గా తయారు చేశారు. మనువరాలి మోడల్ దుస్తుల్ని ధరించి ఫంకీ నగల పెట్టుకుని, కళ్లకు అద్దాలు పెట్టుకుని పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు తీయడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు బామ్మ ఫ్యాషన్, స్టైలిష్ లుక్స్ సూపర్ అని అంటున్నారు. వీటకి తోడు లైట్ కాకుండా డార్క్ కలర్స్‌లో ఉండే దుస్తులను ధరించి ఫొటోలు తీయడంతో ఇవి చూడటానికి చాలా సూపర్‌గా ఉన్నాయి. ఫ్యాషన్‌ దుస్తులు ధరించి చేతిలో రోకలి పట్టుకుని ఒకటి, ఛైర్ మీద కూర్చుని క్యాప్ పెట్టుకుని ఇలా కొత్త లుక్స్‌లో ఈ బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఈమెను చూసి నెటిజన్లు బామ్మను పొగిడేస్తున్నారు. ఈమె ఫ్యాషన్ ముందు హీరోయిన్స్ కూడా పనికిరారని నెటిజన్లు అంటున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఓసారి ఈ బామ్మను చూసేయండి.