America Honey Trap Scam: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ భారతీయులకు రక్షణ కరువవుతోంది. ఇప్పటికే అక్రమ వలసల పేరుతో వేల మందిని ఇంటికి పంపించారు. గ్రీన్‌కార్డులు నిలిపివేశారు. ఉద్యోగ నియామకాల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వొద్దని కంపెనీలకు హుకూం జారీ చేశారు. ఇక అమెరికన్లు భారత షాపులపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్తరకం మోసం వెలుగు చూసింది. భారతీయ విద్యార్థులే లక్ష్యంగా హనీట్రాప్‌కు పాల్పడుతూ.. దోపిడీ చేస్తున్నారు. మాస్టర్స్ చదువుతున్న విదేశీ కొందరు విద్యార్థులు సంపన్నులైన ఎన్నారైలను ప్రేమ, రిలేషన్‌షిప్ పేరుతో మోసం చేస్తున్నారు. తర్వాత వ్యక్తిగత సందేశాల ద్వారా ఒత్తిడి పెడుతూ విలువైన వస్తువులు, డేటా, బ్లాక్‌మేల్ చేస్తున్నారు.
హెల్పర్లుగా చేరి..
వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు.. భారతీయ సంపన్నులనుæ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నారైలను నమ్మించి హెల్పర్లుగా ఇళ్లలో చేరుతున్నారు. తర్వాత నమ్మకంగా ఉంటూ ఇళ్లలోని డబ్బులు, జ్యువెల్లరీ, పర్సనల్ ఇన్‌ఫర్మేషన్, విలువైన వస్తువులు దొంగతనం చేస్తున్నారు. ఎన్నారైలు ఎక్కువగా ఒంటరిగా ఉండడంతో చాలా మంది సహాయకుల కోసం చూస్తుంటారు. దీంతో అమ్మాయిలు ఈ ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తర్వాత దొంగతనం చేసిన డేటా ఆధారంగా ఎన్నారైలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు లాక్కుంటున్నారు.
డల్లాస్, ఓహియోలో ఎక్కువగా..
ఈ తరహా ట్రాప్ ఎక్కువగా డల్లాస్, ఓహియోలో ఎక్కువగా జరుగుతుందని ఓ యువతి ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. కొందరు అయితే హనీట్రాప్‌తోపాటు పర్సనల వీడియోలో, మెస్సేజ్‌లను కూడా మిస్‌యూజ్ చేస్తున్నట్లు సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు డబ్బులు డిమాండ్ చేసి ఇలా వచ్చిన డబ్బులతో ఇళ్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక డల్లాస్, ఓహియో ప్రాంతాల్లో ఇలాంటి చీటింగ్‌లకు అరెస్టులు ఉండవు. ఈ నేపథ్యంలో ఎన్నారైలే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆన్‌లైన్ మోసాల మోసాలు..
అలాగే కొందరు స్టూడెంట్స్ ఆన్‌లైన్ మోసాలు, సైబర్ మోసాలకు కూడా పాల్పడుతున్నారని తెలిసింది. ప్రేమ, అబ్యూవ్స్, హనీట్రాప్ పేరుతో చీటింగ్ చేస్తున్నారు. వీరి లక్ష్యం ఆర్థికంగా ప్రయోజనం పొందడమే. సాధారణంగా హనీట్రాప్.. దేశాల రహస్యాలు తెలుసుకోవడానికి వాడుతుంటారు. కానీ సంపన్న దేశంలో యువతులు.. ఇలా ఒళ్లు అమ్ముకోవడం, ప్రేమ, అబ్యూస్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు.
స్పందిస్తున్న నెటిజన్లు…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి చికాగో, సెయింట్ లూసియాలో కూడా జరుగుతున్నాయని ఓ ఎన్నారై పోస్టు పెట్టాడు. వీటిపై అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలని కొందరు కామెంట్ చేశారు. కొందరు బీకేర్‌ఫుల్ అని సూచిస్తున్నారు. ఒక స్టూడెంట్ రెండేళ్లలో 8 కోట్లు సంపాదించిందని ఓ బాధితుడు తెలిపాడు. కొందరు ఇలాంటివి ప్రపంచమంతా ఉన్నాయని పేర్కొంటున్నారు.
Masters girl students are honey-trapping rich NRIs and stealing their valuables by blackmailing them in Dallas, Ohio.
They are using personal messages to pressure them and are even buying homes with the money. pic.twitter.com/gQ30r8BqFh
— M9 USA (@M9USA_) November 25, 2025