Homeఅంతర్జాతీయంPhilippines Massive Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Philippines Massive Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Philippines Massive Earthquake: ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు వణికిస్తూనే ఉన్నాయి. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితులతో చాలాదేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం ఫిలిప్పీన్స్‌ను భూకంపం వణికించింది. మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూమి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉండటంతో ప్రకంపనలు తీవ్రంగా అనుభూతి చెందాయి.

భూకంప తీవ్రత మార్పులు..
మొదట భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. తర్వాత 7.8కి, చివరకు 8.2కి చేరింది. ఇటీవలి కాలంలో పసిఫిక్‌ ప్రాంతంలో సంభవించిన అతి బలమైన భూకంపాల్లో ఒకటిగా నిలిచింది. భూకంప తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగెత్తారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలుతున్న దృశ్యాలు, పాఠశాల విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించడం, ఇళ్లలో ఫర్నిచర్, టీవీలు కిందపడటం స్పష్టంగా కనిపించాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాణిజ్య భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయి.

ప్రాణ, ఆస్తినష్టం..
తాజా సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు, నలుగురికి పైగా గాయాలయ్యాయి. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్‌ పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానిక అధికారులు ఇది ఇటీవలి సంవత్సరాల్లో అనుభవించిన అత్యంత బలమైన భూకంపం అని తెలిపారు.

పొంచి ఉన్న సునామీ ముప్పు..
భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్‌ జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌ మరియు ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్‌ అగ్నిపర్వతాలు–భూకంపాల సంస్థ కొన్ని ప్రాంతాల్లో ఒక మీటరు పైగా ఎత్తైన అలలు రావచ్చని హెచ్చరిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వేలాది మంది తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తోంది. సముద్ర మట్టంపై నిపుణులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

ఫిలిప్పీన్స్‌ పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలవబడే అత్యంత భూకంప ప్రమాదకర ప్రాంతంలో ఉంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు కలుసుకునేందుకు భూకంపాలు, అగ్నిపర్వతాలు తరచుగా సంభవిస్తాయి. ప్రస్తుతం అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు తీరప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version