https://oktelugu.com/

Russia: రష్యాపై భారీ సైబర్‌ దాడి.. బ్రిక్స్‌ సదస్సు వేళ ఊహకందని విపత్తు ఇదీ

రష్యాలోని కజాన్‌లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన బ్రిక్‌ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ దేశాలకు భారత ప్రధాని నరేంద్రమోదీతోపాట బ్రెజిల్, దక్షిణాఫ్రికాదేశాల ప్రతినిధులు, కొత్తగా చేరిన ఐదు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 9:34 am
    Russia(1)

    Russia(1)

    Follow us on

    Russia: బ్రిక్స్‌ దేశాల 16వ శిక్షరాగ్ర సదస్సు అక్టోబర్‌ 23న రష్యాలోని కజాన్‌లో ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. సదస్సు నిర్వహిస్తున్న పుతిన్‌ను ప్రశంసించారు. అంతకుముందు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెన్‌–రష్యా యుద్ధం ఆపాలని కోరారు. ఇందుకు తమవంత సహకారం అందిస్తామని తెలిపారు. సమస్యకు శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఇక బ్రిక్స్‌ సదస్సుకు వెళ్లిన మోదీకి అక్కడి వెరైటీ రుచులు స్వాగతం పలికాయి. ౖకజాన్‌లోని మైనారిటీలు తయారు చేసే ఛాక్‌–ఛక్‌ లడ్డూలు, కొరొవాయ్‌ కేక్‌లను మోదీ రుచి చూశారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు వీటిని మోదీకి అందించారు. గురువారం(అక్టోబర్‌ 24న) జరిగే బ్రిక్స్‌ సమావేశంలో కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో రష్యాపై సైబర్‌ దాడి జరగడం కలకలం రేపింది.

    విదేశాంగ శాఖ లక్ష్యంగా..
    రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను లక్ష్యంగా సైబర్‌ దాడి జరిగింది. అధికారిక వెబ్‌సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం(అక్టోబర్‌ 23న) ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌ ఎటాక్‌ ప్రారంభమైంది. అయితే మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్‌ దాడులను శక్తివంతంగా తిప్పికొట్టింది. అయితే బుధవారం చేసిన దాడి మాత్రం చాలా తీవ్రమైనది. అని రష్యా తెలిపింది. ఉక్రెయన్‌పై యుద్ధం మొదలు పెట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను లెక్క చేయకుండా మాస్కోక ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు అక్టోబర్‌ 22 నుంచి 24 వరకు కజాన్‌లో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబర్‌ దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

    మోదీ ఆందోళన..
    ఇదిలా ఉంటే.. బ్రిక్స్‌ సమావేశంలో బ్రిక్స్‌ దేశాలు, సదస్సు నిర్వహించిన పుతిన్‌ను ప్రశంసించారు. బ్రిక్స్‌ అనేది విభజన సంస్థ కాదని, మానవాళికి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమి దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉపద్రవాలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.