Male Mosquitoes: దోమలు ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతున్నాయి. ప్రపచంలో దోమలు(Musquto) లేని దేశాల్లో కూడా దోమలు పెరుగుతున్నాయి. ఏటా దోమకాటులో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇక ఈ దోమలు ఇళ్లు, పరిరర ప్రాంతాల్లో నీరు నిలవ ఉండడం, పారిశుధ్యం లోపించడం వంటి కారణాలతో వృద్ధి చెందుతాయి. మనుషులతో కలిసి జీవించే ఈ దోమలు ప్రాణాంతకాలు. చిన్న కాటుతో మనిషి ప్రాణం తీయగలవు, ఆస్పత్రుల పాలు చేయగలవు. వ్యాధులు(Desiese)సోకడానికి ప్రధాన కారణం దోమలే. ఆడదోమ కాటుతోనే వ్యాధులు సోకుతాయి. మనుసులను మగ దోమలు కుట్టవు. ఈ నేపథ్యంలో ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న దోమలకు చెక్ పెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు…
ఉష్ణ మండల ప్రాంతాల్లో దోమలు ఎక్కువ. ఇవి కుట్టడం వలన డెంగీ(Dengue), మలేరియా, టైఫాయిడ్, చికున్ గన్యా వంటి వ్యాధులు సోకుతాయి. ఈ దోమలను కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా(Austrelia)లోని మాక్వేరి విశ్వవిద్యాలయం పరిశోధకులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పురుగు మందుల్లా ఇతర ప్రయోజకర జాతులకు నష్టం జరుగకుండానే దోమల బెడదను నివారించవచ్చని గుర్తించారు. ఈగలపై ఈ ప్రయోగం చేసి విజయవంతమయ్యారు. దీంతో ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గినట్లు నిర్ధారించారు.
ఇతర జాతులకు హాని లేకుండా..
దోమల వీర్యం విషపూరితంగా మార్చడం వలన ఇతర జీవులకు ఎలాంటి హాని కలగదు. ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. మనుషులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మగ దోమలు మనుషులను కుట్టవు. మొక్కలపై ఉంటాయి. మొక్కలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నేపథ్యంలో మగ దోమల వీర్యం విషపూరితం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈమేరకు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. అన్నీ విజయవంతమైతే.. త్వరలోనే దోమలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.