https://oktelugu.com/

Maldives Issue: భారత్ కొట్టిన దెబ్బకు మాల్దీవులకు దిమ్మతిరిగింది.. చైనాను బతిమిలాడుకుంటున్నది

దెబ్బకు వేలాది ఫ్లైట్ల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. వేలాది భారత పర్యటకులు తమ మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బాయ్ కాట్ మాల్దీవులు అనే యాష్ ట్రెండును ట్విట్టర్లో కొనసాగించారు.

Written By: , Updated On : January 10, 2024 / 08:54 AM IST
Maldives Issue

Maldives Issue

Follow us on

Maldives Issue: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదే నోరు జారితే అన్నీ తేడా కొట్టేస్తాయి.. ప్రస్తుతం భారత్ విషయంలో మాల్దీవులు వ్యవహరించిన తీరులో కూడా అదే జరుగుతోంది. లక్షద్వీప్ లో దాని నరేంద్ర మోడీ పర్యటించడం.. అక్కడి సుందర దృశ్యాలు మీ పర్యాటకంలో భాగం కావాలని ప్రజలకు పిలుపునివ్వడంతో మాల్దీవుల మంత్రులకు ఎక్కడో కాలింది. ప్రధాని నరేంద్ర మోడీ మాటలను ఉటంకిస్తూ ట్విట్టర్ ఎక్స్ లో అడ్డగోలుగా ట్వీట్లు చేశారు. భారత్ మురికి దేశమని, పర్యాటకం ఎలా చేయాలో తెలియదని, భారత్ అంటే పేడ వాసన వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా యావత్ భారతదేశం మొత్తం భగ్గున మండిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నిరసన గళం ఎదురయింది. అది మాల్దీవుల పర్యాటకం పై తీవ్రంగా పడింది.

దెబ్బకు వేలాది ఫ్లైట్ల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. వేలాది భారత పర్యటకులు తమ మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బాయ్ కాట్ మాల్దీవులు అనే యాష్ ట్రెండును ట్విట్టర్లో కొనసాగించారు. అంతే కాదు మాల్దీవుల కంటే తమ దేశంలో పగడపు దీవుల సముదాయమైన లక్షద్వీప్ కు వెళ్తామని ప్రకటించారు. ఎప్పుడైతే మాల్దీవుల మంత్రులు తిక్క తిక్క వ్యాఖ్యలు చేశారో.. అప్పటినుంచి మన దేశ వాసులు లక్షద్వీప్ ను ప్రమోట్ చేయడం ప్రారంభించారు. దేశ ప్రధాని కూడా పిలుపునివ్వడంతో చాలామంది ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. లక్షద్వీప్ కు సంబంధించిన వీక్షణలు ఏకంగా కోట్ల సంఖ్యకు చేరాలంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో బాయికాట్ మాల్దీవులు అనే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వానికి చురుకు తగిలింది. భారత్ నుంచి సింహభాగం ఆదాయం వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, భారత ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. పైగా భారత్ పై ఆ ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు తాము చింతిస్తున్నామని, మాల్దీవులకు భారతదేశం అండకావాలని విన్నవించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో భారత్ ఈ విషయంలో మరింత కఠినంగా ఉంటున్నది.

ఇదే క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు. భారత నుంచి పర్యాటకులు పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో చైనా నుంచి వీలైనంత ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని.. తమ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అంతేకాదు ఐదు రోజుల పర్యటనలో భాగంగా చైనాలో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు.. అక్కడి చైనా పాలకులు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో ఆకాశానికి ఎత్తేశారు. మాల్దీవుల అభివృద్ధిలో చైనా పాత్ర చాలా ఉందని.. మాల్దీవుల అభివృద్ధికి చైనా చాలా చేయాలని విన్నవించారు. అంతేకాదు మాల్దీవుల దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. అయితే మాల్దీవుల అధ్యక్షుడు విన్నపం మేరకు చైనా దేశస్తులు అక్కడ ఎంత మేరకు పర్యటిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.