Epstein Files Case: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ శుక్రవారంపలు ఫైళ్లను పబ్లిక్ చేసింది. ఈ డాక్యుమెంట్లలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖుల ఫొటోలు కనిపించాయి. అయితే, విడుదల తర్వాత కొన్ని గంటల్లోనే దాదాపు 16 ఫైళ్లు న్యాయశాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమయ్యాయి. ఈ ఘటన ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఎవరు తొలగించారు? ఎందుకు? అని నెట్లో చర్చలు మొదలయ్యాయి.
మాయమైన ఫైళ్లలో ట్రంప్, మెలానియా ఫోటోలు?
అదృశ్యమైన 16 ఫైళ్లలో 468 నంబర్ డాక్యుమెంట్ ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా, ఎప్స్టీన్, గిస్లేన్ మాక్స్వెల్ ఫోటోలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా బాధితుల వాంగ్మూలాలు, ఎఫ్‌బీఐ రికార్డులు, న్యాయశాఖ అంతర్గత మెమోలు వంటి సున్నితమైన వివరాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫైళ్లు ఉద్దేశపూర్వకంగా తొలగించబడ్డాయా లేక టెక్నికల్ లోపమా అని న్యాయశాఖ ఇప్పటివరకు స్పందించలేదు.
మండిపడుతున్న డెమోక్రాట్లు..
హౌస్ ఓవౖర్నైట్ కమిటీలోని డెమోక్రాట్ సభ్యులు ఈ అంశంపై కట్టుబడి మండిపడ్డారు. అటార్నీ జెనరల్ పామ్ బోందీపై పారదర్శకత డిమాండ్ చేశారు. ‘ఇంకా ఏమి దాచాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు పూర్తి సమాచారం కావాలి‘ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండింగ్‌గా మారింది. కుంభకోణం మరింత గంభీరంగా మారే అవకాశం కనిపిస్తోంది.