https://oktelugu.com/

Anmol Bishnoi: అతడిని అమెరికా అరెస్ట్ చేసింది.. ఇక సల్మాన్ ఖాన్ ఊపిరిపీల్చుకోవచ్చు

ఇటీవల సికిందర్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. అందులో సల్మాన్ ఖాన్, రష్మిక పాల్గొన్నారు. ఈ సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగే ప్రాంతం మొత్తం పోలీసుల అదుపులోకి వెళ్లిపోయింది. దాదాపు నాలుగు అంచల భద్రత పోలీసులు కల్పించారు. కనీసం షూటింగ్ సిబ్బందిని కూడా 10సార్లు తనిఖీ చేస్తే తప్ప లోపలికి అనుమతించలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 19, 2024 / 08:59 AM IST

    Anmol Bishnoi

    Follow us on

    Anmol Bishnoi: సల్మాన్ ఖాన్ కు గతంలో ఎన్నడూ ఇటువంటి భద్రత లేదు. దీనికి కారణం గ్యాంగ్ స్టర్ లారెన్స్ నుంచి వచ్చిన బెదిరింపులే. దానికంటే ముందు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నితుడైన సిద్ధికిని చంపేశారు. సిద్ధికి మహారాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన వ్యక్తి. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ ఘటన కంటే ముందు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద రెక్కీ నిర్వహించారు. కాల్పులు కూడా జరిపారు.. ఇన్ని ఉదంతాలు సల్మాన్ ఖాన్ కు ఉన్న ప్రమాదాన్ని బహిర్గతం చేశాయి. మరోవైపు లారెన్స్ గ్యాంగ్ లో ఇద్దరు సభ్యులు దొరకడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ సాగించారు. ఈ సమయంలోనే లారెన్స్ సోదరుడు అన్మోల్ పేరు బయటికి వచ్చింది. అతడే ఈ వ్యవహారాలు మొత్తం సాగిస్తున్నాడని తేలింది. గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఇప్పటికి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నేటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే లారెన్స్ వంశీయులు కృష్ణ జింకలను దేవుళ్ళుగా పూజిస్తారు. వాటిని సల్మాన్ ఖాన్ వేటాడి చంపి తినడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే నాటి నుంచి అతనిపై యుద్ధం ప్రకటించారు.

    అదుపులో అన్మోల్

    లారెన్స్ సోదరుడు అన్మోల్ ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ గ్యాంగ్ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అన్మోల్ పాత్ర తెరపైకి వచ్చింది. అతడు ఇటీవల ముంబైలో జరుగుతున్న కార్యకలాపాలను తెర వెనుక పర్యవేక్షిస్తున్నాడని.. కొంతమంది రాజకీయ నాయకులు అతడికి అండదండలు అందిస్తున్నారని తేలింది. దీంతో అతడి సమాచారం ఇవ్వాలని.. అలా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి పది లక్షల బౌంటి ఇస్తామని వివరించింది.. దీంతో విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉప్పందిదని.. అత్యంత చాకచక్యంగా అతడిని అరెస్టు చేశారని తెలుస్తోంది. అయితే అతని అరెస్టు వివరాలను ఇంతవరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట పెట్టలేదు. అయితే అతడిని అరెస్ట్ చేశారా? ఒకవేళ అరెస్టు చేస్తే మీడియాకు ఎందుకు చెప్పడం లేదు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. మరోవైపు సల్మాన్ ఖాన్ తో పాటు షారుక్ ఖాన్ కు కూడా ఇటీవల బెదిరింపులు పెరిగిపోయాయి. దీంతో అతని ఇంటి వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.