Lashkar e Taiba Internal Conflict: దురంధర్ సినిమా తెరమీద ఎలా నడుస్తుందో పాకిస్తాన్‌లో కూడా అలాగే నడుస్తోంది. దురంధర్‌లో ఉగ్రవాదులు, మాఫియాలు సంస్థలు, మాఫియాలో అంతర్గత ఘర్షణలు, ఆధిపత్య పోరు వంటివి సినిమాలో ఉన్నాయి. లష్కర్ ఎ తోయిబాలో ఇప్పుడు రియాలిటీగా మారిపోయాయి. భారత్‌తో పోరాడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ఈ ఉగ్ర సంస్థలో, ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నది అంతర్గత విభేదాలు.. ఆధిపత్య పోరే. వ్యక్తిగత పగలు, ఉన్నత హోదాల కోసం పోరు, అధికారం కోసం పోటీలు కానివ్వని కాలం కూడా వస్తుందనే సంకేతమే బిలాల్ అరీఫ్ సలాఫీ హత్యతో తెలుస్తోంది.
Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ఉగ్ర కమాండర్‌ను హత్య..
భారత్‌లో అనేక ఉగ్రదాడుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా కమాండర్ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలాఫీ రంజాన్ పర్వదినం మర్కజ్ తాయిబా మసీదులో నమాజ్ ముగించి బయటకు రాగానే కాల్పులు, కత్తులతో దారుణంగా హత్యకు గురయ్యాడు. మొదట అజ్ఞాత సాయుధుల పనిగా అంతా భావించారు. విచారణ తర్వాత ఓ వ్యక్తిగత కక్ష కథగా బయటపడింది. ఈ హత్య చేసింది అతని మాజీ మిత్రుడు ఒబేదుల్లా ఖాన్, అతని భార్య. ఒబేదుల్లా కాల్పులు జరిపి, ఆ తర్వాత అతని భార్య కత్తితో పొడిచిందని సమాచారం. అంటే కేవలం ఇద్దరు స్నేహితుల మధ్య ఆధిపత్య పోరు కాదు, ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ పగలు కలిసి ఉగ్రవాదంలోకి ప్రవేశించి రక్తపాతానికి దారితీశాయి.
నాలుగేళ్ల కక్ష..
ఒబేదుల్లా ఖాన్ అలుడిని నాలుగేళ్ల క్రితం బిలాల్ అరీఫ్ సలాఫీ హత్య చేశాడు. దీనిపై ఒబేదుల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా, సలాఫీ లష్కర్‌లో కీలక నాయకుడు కావడంతో కేసు కొట్టేసి క్లియరెన్స్ ఇచ్చేశారు. ఈ న్యాయపరమైన తిరస్కరణ కారణంగా ఒబేదుల్లా కక్షను పెంచుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత రంజాన్ రోజు అత్యంత పవిత్రమైన సమయంలో సలాఫీ మీద దాడి చేసి హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
లష్కర్ ఎ తోయిబాలో అంతర్గత చీలికలు..
పాకిస్తాన్ మద్దతు ఉన్న, అమెరికా నిషేధించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థ గతంలో ‘‘సమైక్యంగా భారత్ వైపు దృష్టి’’ కలిగినట్టు కనిపించేది.కానీ ఇటీవలి సంఘటనలు, ప్రధాన కమాండర్ల హత్యలు, అంతర్గత గొడవలు ఈ సంస్థ లోపల గ్రూపుల మధ్య ప్రబలంగా చీలికలు ఏర్పడుతున్నట్టు సూచిస్తున్నాయి. పోలీసులు, న్యాయ వ్యవస్థ వారి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం, పాకిస్తాన్ సైన్యం–ఐఎస్‌ఐ కూడా వారి మధ్య విభేదాలను కొత్తగా కట్టడి చేయలేకపోవడం వంటి అంశాలు కూడా ఈ చీలికలను మరింత లోతుగా పెంచుతుంది.
లష్కర్ లో పదవుల విషయంలో పోటీలు, నాయకత్వ∙గొడవలు, విభిన్న గ్రూపుల మధ్య వైరం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు వారు భారత్‌తో పోరాడడం కంటే తమ మధ్యపోరు మీద ఎక్కువ కాలం గడుపుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి.
