Kerala Nurse Yemen: గల్ఫ్ దేశాలకు ఏటా భారత్ నుంచి వందల మంది ఉపాధి కోసం వెళ్తున్నారు. ఎక్కువ మంది కార్మికులుగా పనిచేయడానికే వెళ్లారు. ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా అమెరికాకు వెళ్తారు. ఇక కేరళలో నర్సింగ్ పూర్తిచేసినవారు ఎక్కువగా విదేశాలకు వెళ్తుటారు. కేరలకు చెందిన నిమిష ప్రియ కూడా ఇలాగే యెమెన్ వెళ్లింది. అయితే అక్కడ ఆమె చేసిన పని కారణంగా యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిమిషప్రియను కాపాడేందకు చర్యలు చేపట్టింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అవసరమైన సాయం చేస్తోందని వెల్లడించారు.
కేసు ఏమిటంటే…
నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి ధామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ, దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంలోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ ఆదిట్ మెహదీ అనే వ్యిక్తిని నిమిష–థామస్ జంట వ్యాపారా భాగస్వామిగా చేసుకున్నారు. అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చిన ప్రియ అది ముగియగానే తిరిగి వెల్లింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మెహది దీనిని అదనుగా భావించి ఆమె డబ్బులు లాక్కోవడంతోపాటు వేధించాడు. ప్రియాను తన భార్యగా మెహదీ చెప్పుకోవడం మొదటు పెట్టాడు. పాస్‌పోర్టు, ఇతర పత్రాలు లాక్కున్నాడు. ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదు. దీంతో 2016లో ప్రియ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే డోస్‌ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్తుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఉరిశిక్ష విధించిన కోర్టు..
ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు నిమిష ప్రియకు మరణ శిక్ష విధించింది యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే మరణ శిక్షను ధ్రువీకరించారు. నెల రోజుల్లో దీనిని అములు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉరిశిక్ష రద్దు చేసేందకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ ఏడాది మొదట్లో యెమెన్ వెల్లిన నిమిష తల్లి అప్పటి నుంచి శిక్ష తప్పించేందకు ప్రయత్నించారు. కానీ అధ్యక్షుడు ధ్రువీకరించడంతో శ్రమ వృథా అయింది. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితేనే నిమిష ప్రియ మరణ శిక్ష నుంచి బయట పడుతుంది.
పరిహారం చెల్లిస్తే..
ఇదిలా ఉంటే.. మృతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే నిందితులు క్షమించి వదిలేసే అవయారం ఉంది. దీంతో ప్రియ కుటుంబం 40 వేల డాలర్లను(రూ.34.20 లక్షలు) మెహది కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత దౌత్య కార్యాలయం ఏర్పాట్లు చేసింది. అయితే న్యాయవాది 20 వేల డాలర్లు డిమాండ్‌చేశాడు. దీంతో చర్చలు ఆగిపోయాయి.