https://oktelugu.com/

Russia Ukraine War: రష్యా–ఉక్రెయిన్‌ వార్‌.. యుద్ధంలో భారతీయుడు మృతి.. తీవ్రంగా పరిగణించిన కేంద్రం!

రష్యా–ఉక్రెయిన్‌(Rusha - Ucrain) మధ్య రెండున్నరేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. వేల మంది మృతిచెందారు. సైనికులతోపాటు సామాన్యులూ చనిపోయారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 15, 2025 / 08:55 AM IST

    Russia Ukraine War

    Follow us on

    Russia Ukraine War: ఉక్రెయిన్‌ అమెరికాతో దోస్తానీని సహించని రష్యా.. ఆ దేశానికి నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఉక్రెయిన్‌ అమెరికా(America) వెంటే ఉంటామని మొండికేసింది. దీంతో రష్యా సైనిక చర్య ప్రారంభించింది. దాదాపు రెండున్నరేలులగా ఇరు దేశాల మధ్య యుద్ధం(War) జరుగుతోంది. ఉక్రెయిన్‌కు అమెరికాతోపాటు యూకే, ఫ్రాన్స్‌ తదితర దేశాలు మద్దతు తెలిపాయి. రష్యా ఒంటరిగా పోరాడుతోంది. ఇటీవలే రష్యాకు ఉత్తర కొరియా మద్దతు తెలిపింది. సుమారు 12 వేల మంది ఉత్తర కొరియా సైనికులను యుద్ధరంగంలోకి దించింది. యుద్ధం ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నించాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. అయినా కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో తొలిసారి భారతీయుడు(Indian) మృతిచెందాడు. మరో భారతీయుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీఉల వివరాలు విడుదల చేయాలని రష్యాను కోరింది. ఢిల్లీలోని రష్యన్‌ రాయబార కార్యాలయం అధికారులతో భారత అధికారులు మాట్లాడారు. సైన్యంలో ఉన్న భారతీయులను వెంటనే పంపించాలని డిమాండ్‌ చేశారు.

    కేరళవాసి మృతి..
    రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళ(Kerala)కు చెందిన టీబీ.బినిల్‌(32) మరణించాడు. అతని సమీప బంధువు టీకే.జైన్‌(27) తీవ్రంగా గాయపడ్డాడు. బినల్‌ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించిందని అతడి సమీప బంధువులు తెలిపారు. ఈ విషయం తెలిసిన బినిల్‌ భార్య షాక్‌కు గురయ్యారు. ఆయనను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాదం జరిగింది. బినిల్‌ మృతికి కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బినిల్‌ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

    భారతీయులను పంపాలని వినతి..
    గతేడాది రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్‌ సదస్సుకు వెళ్లిన భారత ప్రధాని మోదీ.. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను పంపించాలని రష్యా అధినేత పుతిన్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన పుతిన్‌. భారతీయులను పంపించేందుకు అంగీకరించారు. దీంతో ఇప్పటికే అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే బినిల్‌తోపాటు కొంత మంది అక్కడే ఉన్నారు. వారి ఇష్టపూర్వకంగానే సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విషాదం జరగడంతో మరోమారు ఈ అంశం చర్చనీయాంశమైంది.