Justin Trudeau And Katy Perry: ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు బయటకి వెల్లడించేవారు కాదు. తమ అంతర్గత విషయాలను బయటకు రాకుండా చూసుకునేవారు. నేటి కాలంలో రాజకీయ నాయకులు అలాలేరు. పైగా నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాలను బయటపెడుతున్నారు. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. తద్వారా నిత్యం మీడియాలో ఉండేలాగా చూసుకుంటున్నారు. మనదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలోని రాజకీయ నాయకులు మొత్తం ఇలానే ఉన్నారు. అయితే ఈ జాబితాలో ఈ నాయకుడు మాత్రం ఏకంగా అందరిని మించిపోయాడు.
కెనడా ప్రధానమంత్రిగా మొన్నటిదాకా ట్రూడో కొనసాగాడు. భారత్ మీద విపరీతమైన విషం కక్కాడు. అంతేకాదు ఓవర్గం వారికి కొమ్ముకాశాడు. ప్రపంచ వేదికల మీద భారత్ పై విష ప్రచారం చేశాడు. అయినప్పటికీ భారత్ అతడు చేసిన ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. అంతేకాకుండా అతడు తమకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యవహారాలను ప్రపంచ వేదికల ముందు బయటపెట్టింది. దీంతో ట్రూడో కు నిరసన సెగ తగిలింది. అంతేకాదు అతడు తన ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు రాసలీలలో మునిగి తేలుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ట్రూడో అమెరికా పాప్ సింగర్ కెటి ఫెర్రీతో సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నాడు. వీరిద్దరూ విహారయాత్రలో ఉన్నారు. సముద్రంలో ఒక బోటు లో పయనిస్తుండగా.. ఫెర్రీ ను ముద్దు పెట్టుకుంటూ కెనడా మాజీ ప్రధానమంత్రి కనిపించాడు. ఆమె ఈత దుస్తులలో కనిపిస్తుండగా.. ఇతడు వంటిపై ఎటువంటి చొక్కా లేకుండా.. కేవలం ప్యాంట్ మాత్రమే ధరించి ఉన్నాడు. కళ్ళకు గాగుల్స్ పెట్టుకున్నాడు. ఇద్దరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఫెర్రీని అతడు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రూడో కు గతంలోనే వివాహం జరిగింది. 2023లో భార్య సోఫీ నుంచి అతడు విడాకులు తీసుకున్నాడు. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఫెర్రీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహిత సంబంధానికి దారి తీసింది. మరోవైపు ఫెర్రీ ఓర్లాండో అనే నటుడితో కొంతకాలం ప్రేమలో ఉంది. ఇటీవల వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. నిశ్చితార్థ వేడుకను కూడా జరుపుకోలేదు. అయితే ఫెర్రికి ట్రూడో పరిచయమయ్యాడు. అది కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.