Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్ను మూసిన విషయం తెలిసిందే. జిమ్మీ కార్టర్ 39వ అధ్యక్షుడిగా అగ్ర రాజ్యానికి సేవలు అందించారు. ఒక సైనికుడిగా కూడా సేవలు అందించి.. ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పల్లీల వ్యాపారం చేశారు. అలా రాజకీయాల వైపు మళ్లారు. అయితే జిమ్మీ అమెరికా అధ్యక్షుడు.. కానీ ఇతని పేరు మీద దేశంలో ఓ గ్రామం ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడు అయిన జిమ్మీకి, ఆ గ్రామానికి సంబంధం ఏంటనే విషయాలు ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ హయాంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ తన భార్య రోసలిన్ కార్టర్‌తో కలిసి 1978లో భారత్‌లో పర్యటించారు. ఈ క్రమంలో హర్యానాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్‌కి వెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఆ గ్రామానికి కార్టర్ పురి అని పేరు పెట్టారు. అయితే కేవలం ఈ ఒక్క కారణం వల్ల ఆ గ్రామానికి జిమ్మి కార్టర్ పేరు పెట్టలేదు. 1960 సంవత్సరంలో జిమ్మీ తల్లి ఆ గ్రామంలో ఆరోగ్య వాలంటీర్‌గా పనిచేశారు. ఈ కారణం వల్ల కూడా ఆ గ్రామానికి కార్టర్ పురి అని పెట్టారట. జిమ్మీ ఈ గ్రామంలో 1978 జనవరి 3న పర్యటించడంతో అప్పటి నుంచి కార్టర్‌పురిలో సెలవు దినంగా ప్రకటించారు. కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అప్పుడు గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
దాదాపుగా వందేళ్లు జీవించిన జిమ్మీ కార్టర్ ఆదివారం రాత్రి మరణించారు. ఎక్కువ కాలం జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ రికార్డు సృష్టించారు. ఒక అమెరికా అధ్యక్షుడుగా, పల్లీ వ్యాపారవేత్తగా, సైనికుడిగా కంటే గొప్ప విలువలు ఉన్న వ్యక్తిగా జిమ్మీకి గౌరవం ఉంది. 1924న అక్టోబర్ 1 జన్మించిన జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్‌గా ఉన్నతమైన సేవలు చేశారు. 1977 నుంచి 1981 వరకు జిమ్మీ అమెరికా అధ్యక్షుడిగా పాలించారు. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడిగా అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై జిమ్మీ గెలిచి, యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే జిమ్మీ భార్య రోసలెన్ 96 ఏళ్ల వయస్సులో గతేడాది మరణించారు.