Jews Win More Nobel Prizes: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నోబెల్ బహుమతి. మానవాళికి అత్యుత్తమ సేవా అందించిన వ్యక్తులకు, సంస్థలకు ఈ నోబెల్ బహుమతిని అందిస్తారు. చేయడానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త అయిన Alfred Bernhard Nobel 1867లో డైనమైట్ ను కనుగొన్నారు. దీని ద్వారా ఆయన అత్యధికంగా డబ్బులు సంపాదించారు. అయితే ఆయన కనుగొన్నది డైనమైట్ దేనినైనా విధ్వంసం చేస్తుంది. తాను కనుగొన్నది విధ్వంసం చేసేది అని బాధపడ్డాడు. నీతో 1896లో ఆయన మరణించే ముందు తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని ఓ ట్రస్ట్ కు రిజర్వ్ చేశాడు. ఈ డబ్బు పై వచ్చే వడ్డీతో మానవాళికి ప్రయోజనకరమైన కృషి చేసిన వారికి బహుమతులు ఇవ్వాలని తన వీలునామాలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1900వ సంవత్సరంలో నోబెల్ పేరు మీద ఫౌండేషన్ స్థాపించారు.1901 లో మొదటిసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ శాతం యూదులకు మాత్రమే నోబెల్ శాంతి బహుమతులు వస్తున్నాయి? అలా ఎందుకు?
నోబెల్ బహుమతి చరిత్రను పరిశీలిస్తే సుమారు 22 శాతం వరకు యూదులకే వచ్చింది. ప్రపంచ జనాభాలో యూదుల శాతం 0.2 శాతం మాత్రమే. కానీ వారి నిష్పత్తి కంటే 100 రేట్లు ఎక్కువగా బహుమతులు గెలుచుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. యూదుల్లో విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. చిన్నప్పటి నుంచే చదవడం, రాయడం వంటివి నేర్చుకుంటారు. మిగతా వారి కంటే వీరిలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో యూదులు ఏదైనా అధ్యయనం చేస్తే అది పక్కాగా ఉంటుంది. ప్రతి విషయాన్ని వారు గుడ్డిగా నమ్మరు. దానిపై పరిశోధనలు చేసి అసలు విషయం తెలుసుకుంటారు. విమర్శనాత్మకంగా ఆలోచన చేసి సరికొత్త ఆవిష్కరణలకు ప్రయత్నిస్తారు.
సమాజంలో యూదుల బహిష్కరణ ఎక్కువగా ఉంటుంది. 2000 సంవత్సరాలుగా వీరు ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదురయ్యారు. ఇలా ఎక్కువగా వివక్షకు గురి కావడంతో కసి పెంచుకొని అనుకున్నది సాధించేలా ముందుకు వెళ్తారు. యూదులకు ఒకచోట ఉండడం అసలు ఇష్టం ఉండదు. సాంప్రదాయ వృత్తులకు వీరు దూరంగా ఉండి ఎక్కువగా జ్ఞానం పైనే దృష్టి పెడతారు. వీరిని ఎంతమంది విమర్శించినా.. వారి జీవనశైలిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకున్నారు. జీవనోపాధి ఎక్కడ ఉంటే అక్కడికి తరలి వెళ్తారు. యూదుల కుటుంబాల్లో తల్లిదండ్రులు విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా.. వాటిని కట్టుకొని ముందుకు వెళ్లేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తారు. విజయం ఎలా సాధించాలో పలు రకాలుగా వారికి నేర్పుతూ ఉంటారు.
యూదుల గురించి ఒకరి ద్వారా ఒకరు తెలుసుకున్న తర్వాత తమ మనుగడను కాపాడుకోవాలని ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉంటారు. వీరిలో అత్యంత ప్రతిభావంతులు అయి ఉండడం వల్ల పరిశోధన రంగంలో విజయవంతం కావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఈ విధంగా యూదులు విజయం కోసం ఎక్కువగా శ్రమించి ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తారు. అందుకే వారికి ఎక్కువగా నోబెల్ బహుమతులు వస్తుంటాయి.